రాత్రివేళ షూటింగ్లో బిజీగా ఉన్న రామ్ చరణ్!

0Ram-charan-asks-fans-to-supమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘రంగస్థలం 1985’ షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. 1985 కాలంనాటి కథగా రూపొందుతున్న ఈ సినిమాలో అన్ని దృశ్యాలు సహజంగా ఉండాలనే ఉద్దేశ్యంతో దర్శకుడు సుకుమార్ షూటింగ్ చాలా వరకు గోదావరి జిల్లాల్లోనే తీశారు. ఆ తర్వాత రామ్ చరణ్, సమంతల బిజీ షెడ్యూల్స్ వలన హైదరాబాద్లోనే విలేజ్, ఇసుక తిన్నెలు కలిగిన నదీతీరాల సెట్స్ వేసి చిత్రీకరణ జరుపుతున్నారు.

ప్రస్తుతం రామ్ చరణ్, సమంతల మీద నైట్ ఎఫెక్ట్ లో సన్నివేశాలను రూపొందిస్తున్నారు. ఈ చిత్రీకరణలో జగపతిబాబు, ప్రకాష్ రాజ్, ఆది పినిశెట్టి వంటి ఇతర ప్రధాన తారాగణం కూడా పాల్గొంటున్నారు. రామ్ చరణ్ పూర్తి స్థాయి గ్రామీణ యువకుడిగా కనిపించనున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇకపోతే సినిమాను ఈ ఏడాది డిసెంబర్లో రిలీజ్ చేస్తారా లేకపోతే 2018 జనవరికి సిద్ధం చేస్తారా అనే విషయంపై ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు.