కొసరి కొసరి వడ్డిస్తున్న నిహారిక

0సహజంగా స్టార్ కిడ్స్ కు అహంకారం ఉంటుందని – తమకంటే తక్కువ రేంజ్ ఉండేవాళ్ళని కేర్ చెయ్యరని చాలామంది అనుకుంటూ ఉంటారు.. ఒకవేళ ఎక్కడైనా వాళ్ళ మీద దురుసుగా ప్రవర్తించారని రూమర్ వస్తే వెంటనే నమ్ముతారు కూడా! కానీ.. మెజారిటీ స్టార్ కిడ్స్ అలా ఉండరు. అంతెందుకు మెగా డాటర్ నిహారిక విషయం తీసుకోండి.. మనకు విషయం అర్థం అవుతుంది.

రీసెంట్ గా నిహారిక ‘హ్యాపీ వెడ్డింగ్’ అనే రొమాంటిక్ కామెడి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.. ఈ సినిమాలో సుమంత్ అశ్విన్ హీరో. త్వరలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో నిహారిక ఫిలిం యూనిట్ మెంబర్స్ తో చక్కగా కలిసిపోయిందట. అందరితో ఫ్రెండ్లీగా ఉండేదట. అలా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కు తను ఫుడ్ సర్వింగ్ చేస్తూ ఉన్నప్పుడు యూనిట్ మెంబర్ ఒకరు ఒక వీడియో తీయడం జరిగింది. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడం.. అది వైరల్ కావడం తర్వాతి పరిణామాలు. దీన్ని చూసి మెగాఅభిమానులు ముచ్చట పడకుండా ఉండలేకపోతున్నారు. మెగా ఫ్యాన్స్ ను మాత్రమే కాదు అందరినీ తన ఫ్రెండ్లీ నేచర్ తో మెప్పించింది నాగబాబు ముద్దుల కూతురు.

మరోవైపు ‘హ్యాపీ వెడ్డింగ్’ త్వరలో రిలీజ్ కు రెడీ అవుతోంది. శక్తికాంత్ కార్తీక్ ట్యూన్స్ అందించిన ఈ చిత్రానికి తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సమకూర్చాడు. ఈ సినిమాకు దర్శకుడు లక్ష్మణ్ కార్య. UV క్రియేషన్స్ – పాకెట్ సినిమా బ్యానర్లపై ఈ సినిమాను నిర్మించారు.