నిహారిక స్టార్ హీరోయిన్ అవుతుందా?

0మెగాబ్రదర్ నాగబాబు గారాల పట్టీ నిహారిక స్టార్ హీరోయిన్ అవుతుందా.. అవ్వదా? ప్రస్తుతం మెగాభిమానుల్లో ఆసక్తికర చర్చ ఇది. ఇంతకీ అయ్యే ఛాన్సుందా? బాలీవుడ్ లో అనీల్ కపూర్ – శత్రుఘ్న సిన్హా డాటర్స్ స్టార్ హీరోయిన్స్. కోలీవుడ్ లో కమల్ హాసన్ డాటర్ శ్రుతిహాసన్ స్టార్ హీరోయిన్. మరి టాలీవుడ్ లో వన్ అండ్ ఓన్లీ మెగా డాటర్ స్టార్ హీరోయిన్ అవ్వకపోతే ఎలా? ఇదీ నీహా ఫ్యాన్స్ లో చర్చ.

నిహారిక చాలా తెలివిగా ఒక్కో అడుగు ముందుకు వేస్తోంది. ఇప్పటికే ఓ సినిమా(ఒక మనసు) రిలీజైంది. రెండో సినిమా `హ్యాపి వెడ్డింగ్` నేడు రిలీజైంది. టుడే నిహారిక డే. హ్యాపివెడ్డింగ్ రిలీజ్ వేళ కాస్త ఎగ్జయిటింగ్ గానే ఉంది నిహారిక. ఫలితం మరి కొన్ని గంటల్లోనే వెలువడనుంది కాబట్టి ఈ టెన్షన్. అదంతా అటుంచితే నిహారిక స్టార్ హీరోయిన్ అవుతుందా.. అవ్వదా.. అన్నదొక్కటే అభిమానుల టెన్షన్. అయితే మొన్న ఇంటర్వ్యూలో షాక్ ల మీద షాక్ లు ఇచ్చింది మెగా డాటర్. నాలుగేళ్ల తర్వాత నటించనని కరాఖండిగా చెప్పేసన నిహారిక – అటుపై పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిలైపోతానంది. అందరిలాగా 10-15ఏళ్లు నటించనని నాలుగైదేళ్లు మాత్రమే నటిస్తానని బార్డర్ గీసి పెట్టుకుంది. దీంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా కంగారుపడిపోయారు. మెగా బ్రదర్ నాగబాబు డాటర్ .. కమల్ హాసన్ వారసురాలు శ్రుతిహాసన్ అంత పెద్ద స్టార్ అవుతుందనుకుంటే ఇలా అనేసిందేంటి? అంటూ అంతా తెగ ఇదయ్యారు. స్టార్ హీరోయిన్ అయ్యే ఫీచర్స్ ఉన్నా.. ప్రయత్నించే ఆలోచనే లేదు అంటూ తర్జనభర్జన పడ్డారు. పైగా మెగా డాటర్ ఇమేజ్ గ్లామర్ రోల్స్ కి అడ్డంకిగా మారిందని నిహారిక మాటల్ని బట్టి అర్థమైంది. ఓన్లీ పద్ధతైనా తన నిజజీవితానికి దగ్గరైన పాత్రల వరకే నటిస్తానని మరో సరిహద్దును తనకు తానుగానే నిర్ణయించుకుంది. ఇప్పుడు మీరే చెప్పండి నిహారిక స్టార్ హీరోయిన్ అవుతుందా.. అవ్వదా?