అందమైన బికినిలో అడ పులి

0

కొంతమంది హీరోయిన్లు పెద్ద స్టార్లు కాకపోయినా హిట్ సినిమాల్లో నటించకపోయినా గుర్తింపు మాత్రం సంపాదిస్తారు. ఇక పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించిన హీరోయిన్లకు అలాంటి గుర్తింపు ఈజీగా లభిస్తుంది. పవన్ ఓ పదేళ్ళ క్రితం ‘పులి’ అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. బాక్స్ ఆఫీసు వద్ద ప్రేక్షకులను నిరాశపరిచిన ఆ సినిమాలో హీరోయిన్ నికిషా పటేల్. ఆ తరవాత కెరీర్ లో పెద్దగా సక్సెస్ కాలేకపోయినా అందరికి నోటెడ్ అయింది.

ఇక మిగతా బ్యూటీ ల స్టైల్ లోనే ఈ నికిషా కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. హాటు ఫోటోలను పోస్ట్ చేస్తూ నెటిజనులను ఉడికిస్తూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ గ్రీస్ దేశానికి హాలిడేకోసం వెళ్లిందట. ఇక అక్కడ బికినీలో జలకాడుతూ ఒకసారి.. జలకాలాటకు దిగక ముందు పక్కనే పాలరాతి మెట్ల మీద కూర్చుని ఫోటోలు తీసుకుంది. అవి ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసింది. అసలే పాలమీగడ లాంటి ఒంటిరంగు.. పైనేమో బ్లాక్ బికిని. పాలరాతిపై కూర్చున్న పాలరాతి శిల్పంలా ఉంది. ‘పులి’ వచ్చి పదేళ్ళయినా అదే అందం మెయింటెయిన్ చేస్తూ ఈ జెనరేషన్ బ్యూటీలకు గట్టి పోటీ ఇస్తోంది.

ఫోటో చూస్తుంటే ‘మహమ్ మహా మాయే.. ‘ అని ‘పులి’ లోని పవన్ పాట మళ్ళీ పాడాలనిపిస్తోంది. అన్నట్టు.. ఈ సినిమా ఫ్లాప్ అయింది గానీ రెహమాన్ సాంగ్స్ మాత్రం సూపరే. మనమే కాదు నికీషా పటేల్ కూడా ‘పులి’ ని పవన్ ని మర్చిపోవడం లేదు. రీసెంట్ గా సెప్టెంబర్ 2 న పవన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిందండోయ్!
Please Read Disclaimer