నిఖిల్ శిరీష్ ల క్లాష్ తప్పదా?

0

నిఖిల్ హీరోగా రూపొందిన అర్జున్ సురవరం వాస్తవానికి ఈ రోజు విడుదల కావాల్సింది . సరైన స్క్రీన్లు అందుబాటులో లేకపోవడంతో పాటు అవెంజర్స్ ఎండ్ గేమ్ ప్రభావం బలంగా ఉండేలా కనిపించడంతో తప్పని సరి పరిస్థితుల్లో వాయిదా వేసుకున్న టీం ఫైనల్ గా మరో డేట్ ని ఫిక్స్ చేసుకున్నట్టు సమాచారం. అదే మే 17. ఆ రోజు ఇప్పటికే అల్లు శిరీష్ ఎబిసిడికి రిజర్వ్ చేసి ఉంచారు. ఇదీ సరైన తేది కోసం వెయిట్ చేస్తూ మే దాకా వచ్చింది. ఇక వాయిదా ప్రసక్తే లేదు.

సో నిఖిల్ కనక మే 17నే డిసైడ్ అయితే క్లాష్ తప్పదు. రేంజ్ పరంగా ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే కోణంలో కాకుండా చూస్తే సీనియర్ గా ఫాలోయింగ్ పరంగానూ నిఖిల్ కే కాస్త ఎక్కువ ఎడ్జ్ ఉంటుంది. కాకతాళీయంగా ఈ రెండు రీమేకులే కావడం విశేషం శిరీష్ మూవీ అదే పేరుతో వచ్చిన మలయాళం రీమేక్ కాగా నిఖిల్ సినిమాకు తమిళ్ లో వచ్చిన కనితన్ మాతృక

ఇది అధికారికంగా ప్రకటించాక వార్ డిసైడ్ అవుతుంది. అర్జున్ సురవరం మీద నిఖిల్ కు గట్టి నమ్మకమే ఉంది. దాన్ని బలపరిచేలా మంచి రేట్లకు బిజినెస్ జరగడంతో పాటు శాటిలైట్ కు సైతం డిమాండ్ రావడంతో ప్రీ రిలీజ్ వాతావరణం పాజిటివ్ గానే ఉంది. అందుకే రిస్క్ తీసుకోకుండా అనవసరమైన పోటీకి తావివ్వకుండా సేఫ్ రిలీజ్ కోసం వేచి చూశారు. మే 17 అంటే ఆపాటికి మహర్షి హడావిడి కూడా కొంతమేరకు తగ్గిపోయి ఉంటుంది కాబట్టి కొత్త సినిమాల పట్ల ప్రేక్షకులు ఆసక్తిగా ఉంటారు. సో నిఖిల్ శిరీష్ ల మధ్య ఫైట్ ఉంటుందో లేదో రేపో ఎల్లుండో తేలిపోనుంది
Please Read Disclaimer