బిజినెస్ స్టార్ట్ చేసిన నిఖిల్

0



Nikhil-GYM-Businessసినిమాల్లో నటిస్తూనే విజయవంతమైన వ్యాపారవేత్తలుగా రాణిస్తున్నారు నేటి నటీనటులు. వ్యాపారం ఏంటనే దానితో సంబంధం లేకుండా తమ అభిరుచికి తగిన అంశాల పై పెట్టుబడి పెడుతూ లాభాలు ఆర్జిస్తున్నారు. ఈ విషయంలో హీరోల కంటే హీరోయిన్లే కాస్త ముందంజలో ఉన్నారు. బాలీవుడ్ లో అయితే ఈ బిజినెస్ ట్రెండ్ బాగా ఎక్కువుగా కనిపిస్తుంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ ఇంటర్నేషనల్ ఫిట్ నెస్ బ్రాండ్ ఎఫ్ 45 తో కలిసి హైదరాబాద్ లో కొన్ని చోట్ల జిమ్ సెంటర్లు ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు అదే బ్రాండ్ తో యంగ్ హీరో నిఖిల్ కూడా తాజాగా అసోసియేట్ అయినట్లుగా తెలిసింది. ఈ నేపథ్యంలో తాజాగా సికింద్రాబాద్ లో నిఖిల్ ఎఫ్ 45 నూతన బ్రాంచ్ ను ఓపెన్ చేశాడు. దీంతో పాటే త్వరలోనే 6 నూతన జిమ్ సెంటర్లు ఏర్పాటు చేసే పనిలో నిఖిల్ ఉన్నాడని తెలిసింది. సినిమాల్లో బిజీగా ఉంటూనే బిజినెస్ లో కూడా సక్సెస్ కొట్టాలని నిఖిల్ ప్లాన్ చేస్తున్నట్లు విశ్వసనీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి మొన్నటివరకు ఎఫ్ 45 జిమ్ అంటే రకుల్ ప్రీత్ సింగ్ దే కదా అని సమాధానం ఇచ్చే సీని జనాలు ఇక నుంచి ఎఫ్ 45 జిమ్ అంటే నిఖిల్ ది అంటారేమో చూడాలి.