త్వరలో నిఖిల్ పెళ్లి కబురు…ఇండస్ట్రీ అమ్మాయినే?

0Nikhil-marry-industry-girlఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రంతో హై సక్సెస్ ని అందుకున్నాడు నిఖిల్ . దాంతో ఆయన తల్లితండ్రులు వచ్చే సంవత్సరం ప్రధమార్దంలో వివాహం చేయాలని నిర్ణయం నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు అమ్మాయిని నిఖిల్ కుటుంబ సభ్యులు వెతుకుతున్నారట.

వాస్తవానికి చాలా కాలం నుంచీ నిఖిల్ ని పెళ్లి చేసుకోమని కుటుంబ సభ్యులు ఒత్తిడి చేస్తూ వస్తున్నారు. అతని తోటి హీరోల్లాగ పెళ్లి చేసుకుని కెరీర్ ని కంటిన్యూ చేయమని చెప్తున్నారట. స్వామి రారా హిట్ తర్వాత నుంచి ఇంట్లో ఈ పెళ్లి పోరు ప్రారంభం అయ్యిందిట. అయితే నిఖిల్ మాత్రం రేపు, మాపు అంటూ వాయిదా వేస్తూ వస్తున్నాడట. అయితే ఇప్పుడు మాత్రం ఓకే అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటున్నారు.

అయితే ఇండస్ట్రీ బయిటనుంచి వచ్చిన అమ్మాయి అయితే తనకు వృత్తి పరంగా ఇబ్బంది అవుతుందని భావిస్తున్నాడట. షూటింగ్ లు రాత్రిం,బవళ్ళూ ఉంటాయి, ఫ్యామిలీతో కొద్ది కాలం కంటిన్యూగా గ్యాప్ ఉంటుంది. ఇవన్నీ తెలిసిన అమ్మాయి అయితే కలిసిపోతుంది, కొత్తసమస్యలు రావు అని భావించి, ఇండస్ట్రీలోని కుటుంబాల వారితో వియ్యం పొందేలా చూడమని తన పేరెంట్స్ కు చెప్పాడని చెప్పుకుంటున్నారు. ఏదైమైనా త్వరలో నిఖిల్ పెళ్లి కొడుకు అవుతున్నాడన్నమాట.