ఆ హీరో సినిమాలో అందాల రాక్షసి

0సక్సెస్ లేక గత కొంత కాలంగా సతమతమవుతోన్న బ్యూటీ లావణ్య త్రిపాఠి. అందాల రాక్షసి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దగుమ్మను చూసి స్టార్ హీరోయిన్ అయ్యే లక్షణాలు బాగానే ఉన్నాయని మొదట్లో ప్రశంసలు కురిపించారు. పైగా గ్లామర్ క్యారెక్టర్స్ కి కూడా తాను ఒకే అని దర్శకులకు అఫర్ ఇచ్చింది. కానీ ఎన్ని విధాలా ట్రై చేసినా కూడా అమ్మడు పెద్దగా విజయాన్ని అందుకోవడం లేదు. గత ఏడాది చేసిన ఆరు సినిమాలు వరుసగా ఫెయిల్ అయ్యాయి.

ముఖ్యంగా వినాయక్ – సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన ఇంటిలిజెంట్ హిట్ అని అనుకున్నా విడుదల తరువాత మ్యాటర్ తెలిసిపోయింది. ఇక ఆఫర్స్ ఏమి రావనుకుంటున్న సమయంలో అమ్మడికి ఒక మంచి ఛాన్స్ వచ్చింది. యువ హీరో నిఖిల్ సిద్దార్థ్ తో నటించే అవకాశం వచ్చింది. కిర్రాక్ పార్టీ తరువాత నిఖిల్ మరో రీమేక్ సినిమాతో రానున్నాడు. కనిథన్ అనే తమిళ్ సినిమాను తెలుగులో ఒరిజినల్ దర్శకుడు T.N సంతోష్ తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమాలో నిఖిల్ ఒక జర్నలిస్ట్ గా కనిపించనున్నాడు. అతని లవర్ గా గా ఒక డిఫెరెంట్ షేడ్స్ లో లావణ్య పాత్ర ఉండనుందట. ఈ సినిమాలో హీరోయిన్ కోసం దర్శకుడు చాలా మందిని కలిసినప్పటికీ ఫైనల్ గా లావణ్య ను ఒకే చేశాడు. లావణ్య కూడా కథ వినగానే ఒకే చేసిందట. ప్రస్తుతం సినిమా షూటింగ్ ను మొదలుపెట్టారు. నెక్స్ట్ షెడ్యూల్ లో లావణ్య చిత్ర యూనిట్ తో కలవనుందట. ఈ సినిమా కాకుండా వరుణ్ తేజ్ ‘వ్యోమగామి’లో కూడా లావణ్య నటిస్తోంది.