నిఖిల్.. పెన్నుతో గన్నులాంటి లుక్

0తన సినిమా అంటే కచ్చితంగా విభిన్నంగా ఉంటుందని.. ఏదో ఒక కొత్త పాయింట్ తో ఆడియన్స్ ముందుకు వస్తాడని అనిపించేలా గుర్తింపు తెచ్చుకున్నాడు నిఖిల్ సిద్ధార్ధ్. ఒకటి అరా మినహాయిస్తే.. ఇప్పటివరకూ తనపై ఉన్న విశ్వాసాన్ని కోల్పోకుండా అదే తరహాగా ప్రయోగాలతోనే జనాలను ఆకట్టుకుంటున్న ఈ కుర్ర హీరో.. ఇప్పుడు మరో కొత్త జనరేషన్ మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు.

తమిళ్ హిట్ మూవీ గణితన్ ను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు నిఖిల్. టీఎన్ సంతోష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి ఇప్పుడు ప్రీ లుక్ రిలీజ్ చేశారు. ఒకటికి రెండు లుక్స్ రిలీజ్ చేయగా.. రెండిటి థీమ్ ఒకటే. ఒక పోస్టర్ లో పెన్ను పాళీని బాగా పెద్దది చేసి చూపించగా.. గన్ను కంటే పెన్ను శక్తివంతమైనది అని రాసి ఉంటుంది. మరో పోస్టర్ లో అర్జున్ సురవరం అంటూ నిఖిల్ సంతకం పెడుతున్న పోస్టర్ ఉండగా.. పక్కనే ఉన్న డస్ట్ బిన్ లో రివాల్వర్ పడేసి ఉంటుంది.

ముద్ర అనే టైటిల్ ను ఈ చిత్రానికి డిసైడ్ చేసినట్లుగా టాక్ వినిపిస్తుండగా.. ఫస్ట్ లుక్ పోస్టర్ ను జూన్ 1వ తేదీన విడుదల చేస్తామని ప్రీ లుక్ పోస్టర్ ద్వారా వెల్లడించారు. టాగూర్ మధు సమర్పణలో వస్తున్న ఈ చిత్రం.. నిఖిల్ కెరీర్ లో మరో డిఫరెంట్ మూవీగా నిలిచిపోయే అవకాశం ఉందని అంచనాలున్నాయి.