నిన్ను కోరి విచారకరమైన చిత్రం కాదట!

0ninnu-Koru-Once-Upon-A-Timeవరుస హ్యాట్రిక్స్ అందుకుని హుషారు మీదున్న యంగ్ హీరో నాని నటించిన ‘నిన్ను కోరి’ చిత్రం ఈ శుక్రవారం విడుదలకానుంది. టీజర్, ట్రైలర్, ఆడియో అన్నీ ప్రేక్షకులకు కనెక్టవడంతో ఈ సినిమాపై అందరిలోను మంచి ఆసక్తి నెలకొంది. ఈ రొమాంటిక్ డ్రామాను తెరకెక్కించిన దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ ఈ సినిమా నాని కెరీర్లోనే గొప్ప ఎమోషనల్ సినిమాగా నిలిచిపోతుందని అన్నారు.

కథలోని పాత్రల మధ్య గొప్ప భావోద్వేగపూరితమైన సంఘర్షణ ఉంటుందని అలాగని ఇది విచారాకరమైన సినిమా కాదని ప్రతి పాత్రలో ఎమోషన్ తో పాటు బోలెడంత ఫన్ కూడా ఉంటుందని, ఒక పాత్రలో అలా రెండు కోణాలు ఉంటేనే అవి ప్రేక్షకుడికి కనెక్టవుతాయని చెప్పుకొచ్చారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రంలో నివేతా థామస్ హీరోయిన్ గా నటించగా ఆది పినిశెట్టి ఒక కీలకమైన పాత్ర చేస్తున్నాడు.