లక్కీ బ్యూటీ లక్ కోసం నితిన్ ప్రయత్నం!!

0

‘ఛలో’ చిత్రంతో పరిచయం అయిన రష్మిక మందన్న ‘గీత గోవిందం’ చిత్రంతో తెలుగులో టాప్ హీరోయిన్ గా లక్కీబ్యూటీగా మారిపోయింది. ఈమెతో నటించేందుకు యువ హీరోలు తెగ ఆసక్తి చూపుతున్నారు. ‘గీత గోవిందం’ తర్వాత ఈమె నటించిన ‘దేవదాస్’ చిత్రం విడుదలైంది. ఆ చిత్రం యావరేజ్ గా నిలిచినా కూడా రష్మిక క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇప్పటికే ఈమె ‘డియర్ కామ్రెడ్’ చిత్రంలో విజయ్ దేవరకొండతో రెండవ సారి రొమాన్స్ కు సిద్దం అయ్యింది. తాజాగా మరో తెలుగు సినిమాకు ఈమె కమిట్ అయ్యింది.

తెలుగులో ఈమెను పరిచయం చేసిన ‘ఛలో’ చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల ప్రస్తుతం నితిన్ తో ‘భీష్మ’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. నితిన్ గత చిత్రాలు ఫ్లాప్ అయిన కారణంగా ఈ చిత్రంపై చాలా నమ్మకం పెట్టుకుని చేస్తున్నాడు. ఛలో వంటి ఎంటర్ టైనర్ స్క్రిప్ట్ తో నితిన్ హీరోగా వెంకీ కుడుముల ‘భీష్మ’ చిత్రాన్ని చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా రష్మిక మందన్నను ఎంపిక చేసినట్లుగా సమాచారం అందుతుంది.

మొదట ఈ చిత్రంకు కొత్త హీరోయిన్ ను అనుకున్నారు. కాని రష్మిక లక్ తనకు కలిసి వస్తుందనే నమ్మకంతో నితిన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా రష్మికను ఎంపిక చేయాల్సిందిగా దర్శకుడు వెంకీకి సూచించినట్లుగా సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. తనకు తెలుగులో ఛాన్స్ ఇచ్చిన దర్శకుడు వెంకీ మరో సినిమాకు అడగడంతో రష్మిక కాదనకుండా నితిన్ ‘భీష్మ’ చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.
Please Read Disclaimer