నితిన్ పై దొంగతనం ఆరోపణ

0సింహగిరిపై జరిగిన వరాహ లక్ష్మీనృసింహస్వామివారి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా చివరిరోజు జరిగిన వినోదోత్సవంలో ఆసక్తికరమైన ఘట్టం చోటు చేసుకుంది. హీరో నితిన్ పై దొంగతనం ఆరోపణ మోపారు ఆలయ అర్చకుడు.” ఏమండీ.. చాలా సినిమాల్లో హీరోగా నటించి పేరు తెచ్చుకున్నారు.. పైగా బాగా స్థితిమంతులు. అలాటి మీరు స్వామి వారి ఉంగరాన్ని చోరీ చేశారంటే నమ్మశక్యం కాకుండా ఉంది. మర్యాదగా ఇచ్చేయండి.’ అని నితిన్ అడిగారు

అంతేకాదు స్వామి దర్శనానికి వచ్చిన నితిన్‌కు అలయ అలంకారి కరి సీతారామాచార్యులు ఎదురై ఒకమాటైనా మాట్లాడకుండా తాళ్లతో బంధించారు. తర్వాత స్థానాచార్యుడు టి.పి.రాజగోపాల్‌ వద్దకు తీసుకెళ్లారు. ఆయన నితిన్‌పై ప్రశ్నలు సంధించారు. దొంగిలించిన ఉంగరాన్ని ఇచ్చేయమన్నారు. ‘నేను తియ్యలేదండి కావాలంటే చెక్‌ చేసుకోండి’ అని నితిన్‌ బదులిచ్చారు. ‘ స్వామివారి ఉంగరం పోయింది. చోరులెవరో కనిపెట్టే పనిలో ఉన్నాం. మాకు ఉంగరం దొరికే వరకు మీరు బందీలుగా ఉండాల్సిందే.’ అని హుకుం జారీ చేశారు. అయితే ఇదంతా వినోదోత్సవం అని తెలుసుకుని స్వామి తమకు కల్పించిన మహాభాగ్యమని ఆనందోత్సాహాలతో మునిగిపోయారు నితిన్