నితిన్ థ్రిల్లర్ కి డైరెక్టర్ దొరికాడు

0

ఈ ఏడాది నితిన్ కు ఏ మాత్రం అచ్చిబాటు రాలేదు. చల్ మోహనరంగా ఆశించిన ఫలితం ఇవ్వకపోగా ఎన్నో ఆశలు పెట్టుకున్న శ్రీనివాస కళ్యాణం డిజాస్టర్ గా మిగిలింది. అందుకే ఈ సారి కొత్త సినిమా విషయంలో తొందరపడకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ఛలో ఫేం వెంకీ కుడుములతో రష్మిక మందన్న హీరొయిన్ గా భీష్మ అనే వర్కింగ్ టైటిల్ తో ప్రాజెక్ట్ ఓకే చేసిన నితిన్ దాని రెగ్యులర్ షూటింగ్ జనవరి నుంచి మొదలుపెట్టే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా రెండు నెలల క్రితం తమిళ్ లో విడుదలై బంపర్ హిట్ గా నిలిచిన సైకో థ్రిల్లర్ మూవీ రట్ససన్ రీమేక్ హక్కులు నితిన్ తీసుకున్న సంగతి తెలిసిందే.

కోలీవుడ్ లో విష్ణు విశాల్ హీరోగా నటించిన ఈ మూవీ మీద పెద్ద నిర్మాణ సంస్థలే కన్నేసినా తీవ్రమైన పోటీ మధ్య నితిన్ దాన్ని చేజేక్కించుకున్నాడు. అయితే ఒరిజినల్ దర్శకుడు రామ్ కుమార్ తెలుగు వెర్షన్ చేసేందుకు టైం లేకపోవడంతో నితిన్ వేటలో పడ్డాడు. ఫైనల్ గా స్వామి రారా ఫేం సుదీర్ వర్మ లాక్ అయినట్టుగా సమాచారం. ప్రస్తుతం శర్వానంద్ తో వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో 90 దశకం నాటి నేపధ్యంలో మూవీ చేస్తున్న సుధీర్ వర్మ దాని షూటింగ్ ని వచ్చే ఏడాది ఫిబ్రవరి లోపు పూర్తి చేయనున్నాడు. అది మొదలుపెట్టే లోపు రట్ససన్ రీమేక్ తాలుకు తెలుగు స్క్రిప్ట్ పనులు మొదలుపెట్టె విధంగా ప్లానింగ్ జరుగుతోందట.

హీరొయిన్ టెక్నికల్ టీం తదితరాలు సెట్ కావడానికి ఇంకొంత టైం పట్టొచ్చు. చెన్నైలాంటి కేంద్రాల్లో యాభై రోజులకు పైగా సక్సెస్ ఫుల్ గా నడిచిన రట్ససన్ లో నితిన్ పోలీస్ ఆఫీసర్ గా నటించబోతున్నాడు. టీనేజ్ అమ్మాయిల వరస హత్యల బ్యాక్ డ్రాప్ లో రూపొందిన రట్ససన్ స్క్రీన్ ప్లే విమర్శకులతో సైతం వాహ్ అనిపించింది. తెలుగులో కూడా ఈ మేజిక్ వర్క్ అవుట్ అవుతుందనే నమ్మకంతో నితిన్ ఫాన్సీ రేట్ కి కొనేసాడు.
Please Read Disclaimer