శ్రీ రెడ్డి కి నితిన్ వార్నింగ్..

0హీరో నితిన్ కు పవన్ కళ్యాణ్ అంటే ఎంతో ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన సినిమాలు చూసే హీరో అయ్యానని చాల సార్లు చెప్పాడు. అలాంటి అభిమాన హీరో గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఎలా ఊరుకుంటాడు..అందుకే ముందుగా ఓ వార్నింగ్ ఇచ్చి వదిలాడు.

నటి గా చెప్పుకునే శ్రీ రెడ్డి ..తాజాగా పవన్ కళ్యాణ్ ఫై చెప్పలేని విధంగా ఓ మాట అనేసింది. అక్కడి తో ఆగకుండా ఆయన తల్లి ఫై కూడా కామెంట్స్ చేసింది. దీంతో ఈమె ఫై అందరూ విరుచుకుపడుతున్నారు. హీరో నితిన్ స్పందించాడు.

“రియాక్షన్ ఉంటుంది.. వెయిట్ చెయ్ ” అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పటికే అభిమానులు పెద్ద ఎత్తున శ్రీ రెడ్డి ఫై కామెంట్ల దాడి చేస్తుండగా , ఇప్పుడు ఇండస్ట్రీ నుండి కూడా పవన్ మద్దతు పెరుగుతుండడం తో అభిమానులు ఇంకాస్త రెచ్చిపోతున్నారు. మరి శ్రీ రెడ్డి నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది చూడాలి.