దిల్ రాజు చిత్రాన్ని నితిన్ చేయబోతున్నాడట

0nithinశతమానం భవతి సినిమాతో ఘనవిజయం సాధించిన దిల్‌ రాజు, మరోసారి ఆ సినిమా దర్శకుడు సతీష్‌ వేగేశ్నతో సినిమా చేసేందుకు ఓకె చెప్పాడు. చాలా రోజుల క్రితం శ్రీనివాస కళ్యాణం పేరుతో సతీష్‌ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్టుగా తెలిపారు. ముందుగా ఈ సినిమాను సీనియర్‌ హీరో నాగార్జునతో చేయాలని భావించాడు దిల్ రాజు. అయితే ఆ ప్లాన్‌ వర్క్‌ అవుట్‌ కాలేదు. తరువాత వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరో గా శ్రీనివాస కళ్యాణం సినిమా తెరకెక్కుతుందన్న టాక్‌ వినిపించింది.

కానీ తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్‌ కూడా ఈ సినిమా చేయటం లేదట. మరో యంగ్‌ హీరో నితిన్‌ హీరోగా శ్రీనివాస కళ్యాణం సినిమాను పట్టాలెక్కించే ప్లాన్‌లో ఉన్నాడు దిల్‌ రాజు. ఇప్పటికే సతీష్‌ చెప్పిన కథ విన్న నితిన్‌, ప్రాజెక్ట్‌ ఓకె చేశాడన్న టాక్‌ వినిపిస్తోంది. దిల్‌ సినిమాతో నితిన్‌ కు ఘనవిజయాన్ని అందించిన దిల్‌ రాజు. తిరిగి ఇన్నేళ్ల తరువాత అదే హీరోతో పనిచేస్తుండటంతో శ్రీనివాస కళ్యాణం ఆసక్తికరంగా మారింది.