జూ.సౌందర్య రివర్స్ కోటింగ్!

0ఫలానా ముదురు హీరోతో అసలు నటించను…అని ప్రభాసా ఆయనెవరు? అని సూటిగా ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించింది నిత్యామీనన్. అంతగా పరిణతి లేకపోవడం వల్ల ఇలా మాట్లాడిందా? అని సినీమీడియా అప్పట్లో షాక్ కి గురైంది. అయితే అంత బొమ్మ లేదు. తాను ఏం అనుకుంటే అది చేసేయడం నిత్యామీనన్ స్టైల్. కంగనా రనౌత్ కేటగిరీలానే ముక్కుసూటితనం తన ప్రత్యేకత అని కాలక్రమంలో అర్థమైంది. మనసులో దాపరికాలుండవు. లోన ఉన్నదే బయటకు అనేస్తుంది. అదీ తన వ్యక్తిగత విషయాల జోలికొస్తే అస్సలు ఊరుకోదు. వెంటనే కౌంటర్ వేసేస్తుంది. అవతలి వాళ్లు ఎలాంటి వాళ్లైనా నాకేంటి అనుకునే మెండిఘటం. ఇలాంటి యాట్యూట్యూడ్ వల్ల టాలీవుడ్ లో కొన్ని అవకాశాలను కూడా కోల్పోయిన మాట వాస్తవం. ఇటీవలే `గీతగోవిందం` లో కథను నేరేట్ చేసే పాత్రలో కనిపించింది. తెరపై చూస్తున్నంతసేపూ నిత్య మరీ లావైందని.. ఇంత పొట్టిగా ఉందేమిటో అన్న గుసగుసలు వినిపించాయి. ఇవే ప్రశ్నించిన ఓ పాత్రికేయుడిని నిత్యా ఓ రేంజులో ఆడుకుంది.

“పొట్టిగా – బోద్దుగా ఉన్నానని నేనేమీ ఫీల్ కాను. ఆత్మ విశ్వాసం గల అమ్మాయిని. నేనేంటో… నా లైఫ్ ఏంటో క్లారిటీగానే ఉంది. నన్ను విమర్శించిన వాళ్లను చూస్తే నవ్వొస్తోంది. ఏ పనీ పాటా లేని వాళ్లే ఇలాంటి కామెంట్స్ చేస్తారు. పనున్న వారెవరూ పనిగట్టుకుని ఎదుటి వారి జీవితాల్లోకి తొంగి చూడరు.. అంటూ తనదైన శైలిలో అటకాయించింది. కరెక్టే కదా! విమర్శలు చేయడానికైనా కొన్ని హద్దులున్నాయి. వాటిని క్రాస్ చేస్తే ఇలాగే ఉంటుంది మరి. నిత్యనా…మజాకానా!