నిత్యకు ఏమై ఉంటుందబ్బా..

0హీరోయిన్లు అన్నాక గ్లామర్ షో చేస్తేనే స్టార్డమ్ సంపాదించగలరు అనేది కొందరి వాదన. లేదు టాలెంట్ ఉంటే ఎవరినైనా ఇది ఆపలేదు అనేది ఇంకొకరి వాదన. అలా గ్లామర్ ని ఎరా గా వేసి అవకాశాలు పట్టినవారు ఉన్నారు అలాగే టాలెంట్ ని నమ్ముకుని పైకొచ్చిన వారు ఉన్నారు. అందులో మొదటగా చెప్పుకోవాల్సింది నిత్యా మీనన్ గురించే.

అందంతో ఆమె ఎవరికి ఏమాత్రం తీసిపోదు. కానీ చేసినవి మాత్రం దాదాపుగా ట్రెడిషనల్ పాత్రలే. అయినా సరే బోలెడంత ఫాన్స్ ని సంపాదించింది. కానీ ఇప్పుడు ఏమైందో మరి గ్లామర్ వైపు మొగ్గు చూపుతోంది. ఈమధ్యనే జె ఎఫ్ డబ్ల్యు అనే మ్యాగజైన్ కవర్ పేజీ కోసం కెమెరా ముందుకు వచ్చిన ఈ భామ తన అందాలను ఆరబోస్తూ యూత్ ను ఉర్రూతలూగిస్తోంది. ఆమె కర్లీ హెయిర్.. అందమైన కళ్ళు ఒక ఎత్తు అయితే.. ఆమె క్లీవేజ్ షో ఇంకొక ఎత్తు.

కానీ ఈమెకు ఉన్నపళంగా అందాల ఆరబోత చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ ఫ్యాన్స్ ప్రశ్నలు కురిపిస్తున్నారు. మొన్ననే ఆ! సినిమాలో లెస్బియన్ పాత్రలో మెరిసిన ఈమె ఇప్పుడు మళ్లీ కవర్ పేజీ మీద దర్శనం ఇచ్చింది. అంతా బాగానే ఉంది కాని గ్లామర్ మీద మక్కువ పెరగడానికి కారణం ఏమై ఉంటుంది అంటారు? వెయిట్ తగ్గమంటే కోపం వచ్చేసింది కాని.. గ్లామరసం ఆరబోయమంటే మోజుపడుతోంది అంటారా?