హీరోయిన్ నిత్యా కు లైంగిక వేధింపులు

0Nithya-ramఅభిమానం ముసుగులో కొందరు చాలా నీచమైన పనులు చేస్తుంటారు. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో కొంత మంది ప్రవర్తన చాలా అభ్యంతరకరంగా ఉంటుంది. వారికి అసభ్యమైన ఫోటోలు పంపడం, వారిని బయటకు చెప్పడానికి వీలులేని పదజాలంతో వేధించడం లాంటివి చేస్తుంటారు.

ఇలాంటి సంఘటనలు ఇప్పటి వరకు చాలా చూశాం. తాజాగా మరో నటికి ఇలాంటి సమస్య ఎదురైంది. ఆమె పేరు నిత్యా రామ్. కన్నడలో సినిమా హీరోయిన్. తెలుగులో ‘అమ్మ నా కోడలు’ అనే టీవీ సీరియల్‌లో హీరోయిన్‌గా నటిస్తోంది.

గౌతమ్ అనే వ్యక్తి… నా అభిమాని అని చెప్పుకుంటూ నన్ను వేధింపులకు గురి చేస్తున్నాడు. అసభ్యకరమైన ఫోటోలు పంపుతూ నన్ను ఇబ్బంది పెడుతున్నాడు…. అని నిత్యా రామ్ ఫేస్ బుక్‌లో ఓ ఫోటో పోస్టు చేసింది. ఈ వేధింపులకు గురి చేస్తున్న వ్యక్తి ఫోటో కూడా ఆమె పోస్టు చేశారు.

అభిమానం వరకు ఒకే. వారి లిమిట్స్ లో వారు ఉండాలి. కానీ ఇలాంటి పనులు చేస్తే సహించే ప్రసక్తే లేదు. అతడు పంపిన మెసేజ్‌లు చూస్తుంటే అమ్మాయిల పట్ల అతడిని ఆలోచన ఎంత నీచంగా ఉందో అర్థమవుతుంది…. ఇలాంటి వ్యక్తులను ఊరికే వదలకూడదనే ఈ పోస్టు చేశాను అని ఆమె తెలిపారు.

నేను పెడుతున్న ఈ పోస్టు ఇలా అసభ్యంగా ప్రవర్తించే వారికి ఓ గుణపాటం కావాలి. ఇప్పటికైనా వారు మారుతారని ఆశిస్తున్నాను, మహిళల పట్ల గౌరవంగా నడుచుకుంటారని భావిస్తున్నాను అని నిత్యా రామ్ పేర్కొన్నారు.

ఎంతో మంది లవ్లీ పీపుల్ నాకు రోజు ఎన్నో మంచి సందేశాలు పంపుతారు. అవి చదివినపుడు ఎంతో సంతోషంగా ఉంటుంది. మహిళల పట్ల ఎంతో గౌరవంగా నడచుకుంటారు. ఇలాంటివి అందరూ అలవరుచుకోవాలి అని ఆమె అభిప్రాయ పడ్డారు.

నిత్యా రామ్ హీరోయిన్ గా ప్రస్తానం మొదలు పెట్టినప్పటికీ తర్వాత సీరియల్స్ వైపు అడుగులు వేసింది. కన్నడతో పాటు, తెలుగు సీరియల్స్ లో నటిస్తూ బిజీగా గడుపుతోంది.

నిత్యా రామ్ కు వేధింపులు ఇదే తొలిసారి కాదు…గతంలో కూడా నిత్యా రామ్ స్ట్రేంజర్ నుండి వేధింపులు ఎదుర్కొంది.