ది ఐరన్ లేడీ నేనే అంటున్న హీరోయిన్

0

మలయాళం నటి నిత్య మీనన్ కు మొదటి నుండి తన నటనతో కట్టిపడేయడం అలవాటే. అందుకే కాస్త వెయిట్ పెరిగి బొద్దుగా కనిపిస్తున్నా తనకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. రెగ్యులర్ గ్లామర్ రోల్స్ మాత్రం రావడం లేదు గానీ నిత్య ఖాతాలో మంచి ఆఫర్లే ఉన్నాయి. తాజాగా ‘అమ్మ’ జయలలిత బయోపిక్ చేస్తున్నానంటూ కన్ఫాం చేసింది.

ఈమధ్య ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి వెల్లడించింది నిత్య. అందులో జయలలిత బయోపిక్ ‘ది ఐరన్ లేడీ’ కూడా ఉందని చెప్పింది. డైరెక్టర్ ప్రియదర్శిని తనను జయలలిత బయోపిక్ కోసం కలిసినప్పుడు తనకు ప్రాజెక్ట్ పై ఉండే ఫోకస్ తెలిసిందని చెప్పింది. జయలలిత బయోపిక్ చేపట్టడం ఒక పెద్ద బాధ్యత తో కూడుకున్న విషయమని .. మనం ఈ సినిమా చేస్తున్నామంటే జయలలిత పాత్రకు న్యాయం చేయగలిగే పనైతేనే టేకప్ చేద్దామని ప్రియదర్శినికి ముందే చెప్పేసిందట. ప్రియదర్శని ఈ ప్రాజెక్టు విషయంలో సరైన దిశలోనే వెళ్తోందని.. ఈ సినిమాలో నటించేందుకు ఆసక్తిగా ఉన్నానని తెలిపింది. ఒక నటిగా ఇది తనకు మంచి అవకాశం అని కూడా చెప్తోంది.

ఈ సినిమాతో పాటు నిత్య ఎన్టీఆర్ బయోపిక్ లో మహానటి సావిత్రి గారి పాత్రలో నటిస్తోంది. మరోవైపు హిందీలో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న ‘మిషన్ మంగల్’ సినిమాలో ఒక కీలకపాత్ర పోషిస్తోంది. ఈ సినిమాలో ఒక సైంటిస్ట్ గా కనిపిస్తుందట. ఈ సినిమా దర్శకుడు జగన్ శక్తి.. నిర్మాత ఆర్. బాల్కి ఇద్దరూ తనను మొదట కలిసినప్పుడు ఈ సినిమాలో మిమ్మల్ని తీసుకునేందుకు అక్షయ్ కుమార్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని తెలిపారట. మొత్తానికి బాలీవుడ్ హీరోలకు కూడా నిత్య యాక్టింగ్ టాలెంట్ తెలిసి పోయింది.
Please Read Disclaimer