పవన్ ‘తొలిప్రేమ ’ రీమేక్

0

Nitin-in-pawan-toliprema-remakeదాదాపు పది హేను సంవత్సరాల క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ కి ఊపు తీసుకొచ్చిన చిత్రం ‘తొలిప్రేమ ’. పవన్ కల్యాణ్ హీరోగా, కరుణాకరణ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పుడు సెన్సేషన్. ఈ సినిమా తరువాత పవన్ కి యూత్ ఫాలోయింగ్ ఫుల్లుగా వచ్చేసింది. అయితే ఇఫ్పుడు ఫిలింనగర్ నుండి వినిపిస్తున్న వార్తల ప్రకారం ఇప్పుడు ఈ సినిమాను నితిన్ హీరోగా రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట. పవన్ కళ్యాణ్ కి పెద్ద ఫ్యాన్ అయిన నితిన్ ఇటీవలే ఈ సినిమాలోని పాటను తన సినిమాలో పెట్టుకొని పెద్ద హిట్టుకొట్టాడు.

త్వరలో కరుణాకరణ్ దర్వకత్వంలో నితిత్ హీరోగా ఓ చిత్రం రూపుదిద్దుకుంటుంది. సెప్టెంబర్ నుండి సెట్స్ పైకి వెళ్లే ఈ సినిమా ‘తొలి ప్రేమ’కు రీమేక్ అని సమాచారం. ఇటీవల కరుణాకరణ్ ఓ సందర్భంలో మాట్లాడుతూ, తొలిప్రేమను ఇప్పుడు రీమేక్ చేసినా పెద్ద సక్సెస్ అవుతుందని, అన్ని విధాల అర్హతలు ఉన్న చిత్రమని అంటున్నాడు. దాంతో వీరిద్దరి కాంబినేషనల్లో వచ్చే ఈ సినిమా దానికి రేమేక్ అనే వార్తలకు మరింత బలం చేకూరింది. పవన్ అభిమానిగా ఉన్న నితిన్ ఈ చిత్రం చేస్తే ఫ్యాన్స్ ఏ మేరకు అంగీకరిస్తారో చూడాలి.

Nitin in Tholiprema Remake,  Nitin Using Pawan kalyan,  Nitin Latest Movies,  Nitin Heart attack with Puti Jagannath,  Nitin Movie with Karuna karan,  Nitin in Pawan kalyan Tholiprema Movie Remake, పవన్ ‘తొలిప్రేమ ’ రీమేక్,
Please Read Disclaimer