చంచల్‌గూడ జైల్లో హీరో నితిన్

0



Nitin-movie-shooting-chanchహీరో నితిన్ చంచల్ గూడ జైలు బాట పట్టాడు. తప్పు చేసిన వాల్లే జైలు బాట పడతారు అనుకుంటే పొరపాటే… సినిమా వాళ్లు కూడా షూటింగుల కోసం అప్పుడప్పుడు అలా జైలుకెళ్లొస్తుంటారు. నితిన్ తాజాగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగులో భాగంగానే నితిన్ జైలుకెళ్లాల్సి వచ్చింది.

14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. . ఈ సినిమాలో నితిన్ పాత బస్తీ కుర్రాడిగా కనిపించనున్నాడు.