నన్ను లావు అన్నారుగా.. ఇప్పుడేమంటారు?

0

తెలుగు ప్రేక్షకులను ‘అలా మొదలైంది’ అంటూ పలకరించి పలు చిత్రాల్లో నటించిన ముద్దుగుమ్మ నిత్యామీనన్ గత కొన్ని రోజులుగా బొద్దుగుమ్మగా మారిపోయిన విషయం తెల్సిందే. ముద్దుగుమ్మ బొద్దుగుమ్మ అవ్వడంతో మీడియాలో మరియు సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తం అయ్యాయి. నిత్యామీనన్ కు పలువురు బరువు తగ్గాల్సిందిగా సోషల్ మీడియాలో సలహా ఇచ్చారు. తనకు బరువు తగ్గమంటూ సలహా ఇచ్చిన వారికి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చిన నిత్యామీనన్ మరోసారి ఈ విషయమై స్పందించింది.

తాజాగా నిత్యామీనన్ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ లో లీడ్ రోల్ కు సెలక్స్ అయ్యింది. జయలలిత పాత్రకు బరువు ఎక్కువ ఉన్న హీరోయిన్స్ కోసం వెదుకుతున్న చిత్ర యూనిట్ సభ్యులకు నిత్యామీనన్ ను ఎంపిక చేశారు. గత కొన్ని రోజులుగా ఈ విషయమై తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఎట్టకేలకు ఆ విషయమై క్లారిటీ ఇచ్చింది. లావుగా ఉన్న కారణంగా తనకు జయలలిత పాత్ర దక్కింది అంటూ నిత్యామీనన్ సంతోషంతో ప్రకటించింది.

నిత్యామీనన్ కెరీర్ ఆరంభం నుండి కూడా వచ్చిన అవకాశంను సద్వినియోగం చేసుకోవడం తప్ప – అవకాశాల కోసం ప్రత్యేకంగా ప్రయత్నాలు చేసేది కాదు. ఇప్పుడు కూడా అలాగే జయలలిత పాత్ర నిత్యామీనన్ వద్దకు వచ్చినట్లుగా తెలుస్తోంది. లావుగా ఉన్నావంటూ తనను గేలి చేసిన వారికి ఈ చిత్రంతో సమాధానం చెప్పాలని నిర్ణయించుకుంది.
Please Read Disclaimer