నివేదాకి కూడా లైంగిక వేధింపులు

0కథువా, ఉన్నావ్‌ అత్యాచార కేసులు..చిత్ర పరిశ్రమలో కాస్టింగ్‌ కౌచ్‌ .. పై ఇప్పుడు సర్వాత్ర చర్చ జరుగుతుంది. టాలీవుడ్‌కి చెందిన మహిళా ఆర్టిస్టులు తాము ఎదుర్కొంటున్న సమస్యల గురించి బయటపెడుతున్నారు. బాలీవుడ్‌కి చెందిన పలువురు నటీమణులు కూడా ఇలాంటి వేధింపులు ఎదుర్కొన్నామని వెల్లడించారు.

తాజాగా దీనిపై నటి నివేదా పేతురాజ్‌ (మెంటల్‌ మదిలో ఫేం) స్పందించారు. చిన్నప్పుడు తనపై లైంగిక వేధింపులు జరిగాయని వెల్లడిస్తూ సోషల్‌మీడియాలో ఓ వీడియో పోస్ట్‌ చేశారు. ‘ప్రతి ఒక్కరూ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు లైంగిక వేధింపులు ఎదుర్కొన్నవారే అయివుంటారని భావిస్తూ ఈ వీడియోను పోస్ట్‌ చేస్తున్నాను. వారిలో నేనూ ఉన్నాను. ఐదేళ్ల వయసులో లైంగిక వేధింపులకు గురయ్యాను. ఈ విషయాన్ని నా తల్లిదండ్రులకు ఎలా చెప్పను? తెలియని వారికంటే.. మన బంధువులు, స్నేహితులు, చుట్టుపక్కల వారిలోనే ఇలాంటి పనులకు పాల్పడే వారు ఉంటారు.’అని చెప్పుకొచ్చింది నివేదా.