మెగా క్యాంపులో హాటీకి నో ఛాన్స్?

0rajasekhar-daughter-shivaniమెగాస్టార్ చిరంజీవితో హీరో రాజశేఖర్- జీవిత దంపతులకు అంతగా పొసగదనే విషయం తెలిసిందే. కోలీవుడ్ మూవీ రమణ రీమేక్ రైట్స్ విషయంలో వీరి మధ్య అంతరం నెలకొనగా.. ఆ తర్వాత భీమవరం ప్రాంతంలో చిరంజీవికి వ్యతిరేకంగా ఈ జంట ప్రచారం చేయడం అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. వారిని కారులో వెంబడించడమే కాక రాళ్లతో దాడి చేశారని వార్తలొచ్చాయి. అయితే.. ఈ ఘటనపై చిరంజీవి స్వయంగా రాజశేఖర్ ఇంటికి వెళ్లి సర్దిచెప్పినా.. ఆ వైరం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నట్లుగా అనిపిస్తుంది.

ఇప్పుడు రాజశేఖర్ కూతురు శివాని సినీ అరంగేట్రం చేయడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ముందు నుంచే ఈ వార్తలు ఉన్నా.. రీసెంట్ హాట్ ఫోటో షూట్స్ తర్వాత ఈ విషయం ఖాయమైంది. రీసెంట్ గా అల్లు అర్జున్ నా పేరు సూర్య అనే మూవీ స్టార్ట్ చేశాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా శివాని బాగుంటుందనే విషయాన్ని కొందరు అల్లు అరవింద్ దృష్టికి తీసుకెళ్లారు. కానీ ఈ విషయంపై అల్లు వారి నుంచి రియాక్షన్ ఆశించిన స్థాయిలో లేదని చెప్పుకుంటున్నారు. మెగా క్యాంపులో రాజశేఖర్ కూతురు నటించాలంటే.. మెగాస్టార్ కూడా ఒకసారి ఎస్ అనాల్సిందే అనే టాక్ వినబడుతోంది.

అరంగేట్రంలోనే శివానికి అల్లు అర్జున్ తో నటించే అవకాశం రావడం అంటే.. టాప్ హీరోయిన్ స్థాయికి చేరేందుకు లభించిన చక్కని అవకాశంగా చొప్పొచ్చు. అలాగే అల్లు అర్జున్ పక్కన తమ కూతురు శివానిని నటింపచేయడానికి రాజశేఖర్ దంపతులకు అభ్యంతరం లేదనే టాక్ కూడా ఉంది. ఇప్పుడు తుది నిర్ణయం అంతా అల్లు అరవింద్ చేతిలోనే ఉందని అంటున్నారు. మరి ఆయన పాత విషయాలను మైండ్ లో పెట్టుకుంటారా.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశం అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది.