బాబాయ్ కి సర్ ప్రైజ్ ఏది చెర్రీ?

0నిన్ననే మెగా పవర్ స్టార్ రామ్చరణ్ బాబాయ్ పవన్ కల్యాణ్ పుట్టినరోజుకి అదిరిపోయే గిఫ్ట్ ఇస్తానని అన్నాడు. ఒక రన్నింగ్ కార్ లో చరణ్ మాట్లాడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అయ్యింది. మెగా ఫ్యాన్స్లో బాబాయ్ కి ఏం సర్ ప్రైజ్ ఇస్తాడో అంటూ ఒకటే క్యూరియాసిటీ రెయిజ్ అయ్యింది. కానీ ఇంతవరకూ చెర్రీ ఏ సర్ ప్రైజ్ ను ఇవ్వలేదేంటో? అసలింతకీ ఏమైంది చెర్రీ?

చరణ్ ఇన్ స్టా – ఫేస్బుక్ ఇవన్నీ పరిశీలిస్తే ఇంతవరకూ ఏ సర్ ప్రైజ్ లేదు. కిచ్చా సుదీప్ కి నిన్న సాయంత్రమే విష్ చేశాడు. హ్యాపీ బర్త్ డే కిచ్చా అంటూ శుభాకాంక్షలు తెలిపాడు. బాబాయ్ని ఈరోజు సర్ ప్రైజ్ చేస్తానన్నాడు? కానీ అందుకు సంబంధించిన వీడియో కానీ – వేరొకటి కానీ ఏదీ లేదు. అయితే చరణ్ కంటే ముందే పీఎస్ పీకే అభిమానులు సామాజిక మాధ్యమాల్లో సంబరాలు చేసేసుకున్నారు. పవన్ కి బర్త్ డే శుభాకాంక్షలు చెబుతూ ఎవరికి వారు అభిమానం చాటుకున్నారు.

అయితే చరణ్ ఇంత వెయిట్ చేయించాడంటే ఏదో పెద్ద సర్ ప్రైజే ఉండబోతోందని అనుకోవచ్చు. ఈరోజు చరణ్- బోయపాటి మూవీ ఫస్ట్ లుక్ లాంచ్ అవుతుందని – తన సినిమా టైటిల్ ప్రకటిస్తాడని భావించారు. అయితే అంతకుమించి ఇంకేదైనా సర్ ప్రైజ్ ఇవ్వాలని చరణ్ భావిస్తున్నాడా? అన్నది కాస్త వేచి చూడాలి. బహుశా ఈ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటికి చరణ్ – మెగాస్టార్ చిరంజీవి & టీమ్ స్వయంగా వెళ్లి విషెస్ చెబుతున్నారేమో చూడాలి.