ఎంబీఏ విద్యార్థినికి మత్తుమందిచ్చి రేప్.. ఆపై అశ్లీల వీడియో…

0



rapes-daughter-in-rajamahenదేశరాజధాని ఢిల్లీకి సమీపంలోని నోయిడాలో మరో దారుణం జరిగింది. ఎయిర్‌హోస్టెస్ ఉద్యోగం మానేసి.. ఎంబీఏ చదువుతున్న విద్యార్థినిపై ఆమె స్నేహితుడే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈమెకు మత్తుమందు ఇచ్చి.. ఆపై రేప్ చేసి వీడియో తీశాడో కామాంధుడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే…

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బహ్రాయిచ్ ప్రాంతానికి చెందిన ఓ యువతి ఎయిర్ హోస్టెస్‌‌గా కొంతకాలం పాటు పని చేసింది. ఇపుడు ఉద్యోగం మానేసి.. ఎంబీఏ చదువుతోంది. ఈమెపై సెక్టార్ – 45లోని ఒక అపార్ట్ మెంట్‌లో నివసిస్తున్న అమిత్ చౌహాన్ ఈ దురాగతానికి పాల్పడ్డాడు.

ఆమెకు మత్తుమందిచ్చిన చౌహాన్.. అత్యాచారం జరిపి, అశ్లీల వీడియో తీశాడు. ఈ దారుణం 3నెలల క్రితం జరిగింది. దీనిని తెలుసుకున్న ఆ యువతి ఎదిరించడంతో… చౌహాన్ ఆమెను తీవ్రంగా కొట్టి చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.

పోలీసులు ఆమెను వైద్య పరీక్షలకు తరలించారు. నోయిడా, సెక్టార్ -9 పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ దారుణానికి పాల్పడింది ఆమె స్నేహితుడే కావడం గమనార్హం.