బాహుబలి 2 Vs నోకియా 3310

0Nokia-3310-Mobileనోకియా 3310..! ఇది కేవలం ఫీచర్ ఫోన్ మాత్రమే అయినప్పటికీ ఈ మోడల్‌ను నోకియా మళ్లీ తెస్తుండడంతో చాలా మంది ఈ ఫోన్ కొనేందుకు ఆసక్తి కనబరిచారు. గత ఫిబ్రవరి నెలలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో నోకియా తన 3310 ఫోన్‌ను ప్రదర్శించింది కూడా. అయితే విడుదల తేదీ ఎప్పుడని మాత్రం చెప్పలేదు. కాగా విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇప్పుడా తేదీ గురించిన వివరాలు నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.

ఈ నెల 28వ తేదీన నోకియా 3310 (2017) ఫోన్ విడుదల కానున్నట్టు తెలిసింది. ముందుగా జర్మనీ, ఆస్ట్రియా దేశాల్లో ఈ ఫోన్ లభ్యం కానుంది. ఆ తరువాత వారం రోజులకు ప్రపంచ వ్యాప్తంగా దీన్ని అందుబాటులోకి తేనున్నట్టు సమాచారం. ఈ క్రమంలో ఇప్పటికే ఈ ఫోన్ కోసం నోకియా ప్రీ ఆర్డర్లను స్టార్ట్ చేసే పనిలో పడినట్టు తెలుస్తోంది. ముందుగా ఆర్డర్ ఇచ్చిన వారికి రిలీజ్ డేట్ కన్నా ముందే ఫోన్లను డెలివరీ చేసేలా నోకియా ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. కాగా మన దగ్గర ఈ ఫోన్‌ను రూ.3,400 ధరకు విక్రయించనున్నారు.