బాహుబలి భామ కొత్త డ్యాన్స్

0మన దేశంలో రకరకాల కొత్త టైపు డ్యాన్సులు వస్తూనే ఉంటాయి. ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్ ను అందిపుచ్చుకోవడంలో స్పెషలిస్ట్ అయిన మన దేశానికి.. ఇప్పుడు డ్యాన్స్ హాల్ అనే కొత్త డ్యాన్సింగ్ థీమ్ ను పరిచయం అవుతోంది. దేశంలో మొదటి డ్యాన్స్ హాల్ సాంగ్ అంటూ ‘బేబీ మర్వాకే మానేగీ’ అనే సాంగ్ ిప్పుడు సెన్సెషన్ సృష్టిస్తోంది.

ర్యాపర్ రాఫ్తార్ తో పాటు బాహుబలి ఐటెం భామ నోరా ఫతేహి ఈ బేబీ మర్వాకే మానేగీ పాటలో చిందులు వేసింది. రాఫ్తార్ ఈ పాటను తనే పాడేసి.. కంపోజ్ చేసేసి.. తనే రాసేశాడు కూడా. అయితే ఈ పాటలో రాఫ్తార్ తో పాటు.. ఇంకా చెప్పాలంటే అతని కంటే ఎక్కువగా నోరా ఫతేహి ఎక్కువ ఎట్రాక్షన్ అయిపోయింది. జమైకన్ డ్యాన్స్ కు అప్డేటెడ్ వెర్షన్ గా ఈ డ్యాన్స్ హాల్ థీమ్ ఇప్పుడు బాగా పాపులర్ అయిపోతోంది. మన దేశంలో మొదటిసారిగా ఆ డ్యాన్సింగ్ మూమెంట్స్ ను చూపించేసింది నోరా ఫతేహి.

ముఖ్యంగా నోరా చేసిన హిప్ షేక్స్ చూపరులను మతి పోగొట్టేస్తాయి. నోరా ఫతేహి డ్యాన్సింగ్ స్కిల్స్ అదరహో అనాల్సిందే. మ్యూజిక్ లవర్స్ ను సాంగ్ అండ్ మ్యూజిక్ ఎట్రాక్ట్ చేస్తే.. గ్లామర్ లవర్స్ ను నోరా ఫతేహి ఆకట్టుకుంటుంది. అందుకే విడుదలైన ఒక్క రోజులోనే ఈ బేబీ మర్వాకే మానేగీ సాంగ్ కు 7.7మిలియన్ల వ్యూస్ వచ్చేశాయి.