స్నేహితుడు.. నిజాయతీపరుడైన వ్యక్తిని పెళ్లాడాలన్నదే నా కోరిక

0kajal-agrwalతెలుగు, తమిళంలో బిజీ కథానాయికగా రాణిస్తున్నారు కాజల్‌ అగర్వాల్‌. అజిత్‌తో నటించిన ‘వివేగం’, విజయ్‌తో నటించిన ‘మెర్సల్‌’ చిత్రాలు ఇటీవలే తెరపైకి వచ్చాయి. ఇంకా పలు చిత్రాల్లో నటిస్తున్నారు. ఇదిలా ఉండగా తన పెళ్లి గురించి పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇస్తూ ‘త్వరగా పెళ్లి చేసుకోమని తల్లిదండ్రులు తొందర పెడుతున్నారు. కానీ నేను మరిన్ని సినిమాల్లో నటించాలని అనుకుంటున్నా. అందుకే వస్తున్న అవకాశాలను పరిశీలించి నచ్చినవాటిలోనే నటిస్తున్నా. ఇంకొన్ని సంవత్సరాలు తప్పకుండా సినీ పరిశ్రమలోనే ఉంటా. అప్పటి వరకు పెళ్లి ఆలోచనే లేదు. మంచి స్నేహితుడు.. నిజాయతీపరుడైన వ్యక్తిని పెళ్లాడాలన్నదే నా కోరిక. అలా నేను ఎదురుచూసే గుణగణాలు ఉన్న వ్యక్తి కనిపిస్తే తప్పకుండా అతన్నే పెళ్లి చేసుకుంటా. కానీ ఇప్పటికి మాత్రం పెళ్లి ఆలోచనే లేదు అని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా కాజల్‌ చెల్లెలు నిషా అగర్వాల్‌ మాత్రం 2013లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.