నోటా దర్శకుడి నిజాయితీ!!

0

విజయ్ దేవరకొండ నోటా విడుదల రోజుల నుంచి గంటల్లోకి మారిపోయింది. ఎల్లుండి రాబోతున్న ఈ సినిమా కోసం అభిమానులతో పాటు హీరో కూడా చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నాడు. తక్కువ టైంలోనే ఇలాంటి పొలిటికల్ థ్రిల్లర్ లో నటించే అవకాశం రావడంతో అందులోనూ విజయ్ ది సిఎం పాత్ర కావడం ఇవన్నీ నోటాను స్పెషల్ గా నిలబెడుతున్నాయి. కాకపోతే క్రేజ్ విషయంలో కొంత హైప్ తక్కువగా కనిపించడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది దర్శకుడు ఆనంద్ శంకర్ ట్రాక్ రికార్డు.

తెలుగువాళ్ళకు పరిచయం లేని ఆనంద్ శంకర్ ఇప్పటి దాకా దర్శకుడిగా తీసిన సినిమాలు రెండే. ఒకటి అరిమనంబి. క్రిటిక్స్ తో సైతం ప్రశంశలు అందుకుంది కానీ కమర్షియల్ గా పెద్ద రేంజ్ కు వెళ్ళలేదు. దాన్నే దేవా కట్టా మంచు విష్ణుతో డైనమేట్ పేరుతో రీమేక్ చేస్తే ఇక్కడ డిజాస్టర్ అయ్యింది. ఇక విక్రమ్ ని విభిన్న కోణంలో డ్యూయల్ రోల్ తో ఇరుమగన్ తీసాడు. అది మనకు ఇంకొక్కడుగా డబ్బింగ్ రూపంలో వచ్చింది. ఫలితం రిపీట్ అయ్యింది కానీ ఎవరికీ పేరు రాలేదు. మూడోదే ఈ నోటా.

గత సినిమా ఫలితాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు దర్శకుడు ఆనంద్ శంకర్ నిజాయితీగా అవి అందరికి నచ్చేలా తీయలేకపోవడం వల్లే పరాజయం పాలయ్యాయని ఒప్పేసుకున్నాడు. నోటా ప్రమోషన్ లో ఈ విషయం గురించి చెబుతూ యావరేజ్ లేదా బిలో యావరేజ్ క్యాటగిరీలో మిగిలిపోయిన ఆ రెండు సినిమాల గురించి తర్వాత విశ్లేషణ చేసానని వాటిని సరిదిద్దుకునే జాగ్రత్తగా నోటా స్క్రిప్ట్ తయారు చేసినట్టు చెప్పాడు. మన ప్రేక్షకుల అభిరుచులకు తగినట్టుగా వాటిని మలచడంలో ఫెయిల్ అయినందువల్లే అవి పెద్ద సక్సెస్ కాలేదని చెప్పాడు.

నోటా హిట్ కావడం ఆనంద్ శంకర్ కు చాలా అవసరం. తమిళ్ లో క్రేజ్ బాగానే రావడంతో టాక్ కనక బాగా వస్తే విజయ్ దేవరకొండ కోలీవుడ్ డెబ్యూ విజయవంతంగా జరుగుతుంది. మెహ్రీన్ హీరోయిన్ గా సత్య రాజ్ నాజర్ ప్రియదర్శి ఇతర కీలక పాత్రలు పోషించిన నోటా ఓవర్సీస్ లో కూడా భారీ విడుదలను దక్కించుకుంది.
Please Read Disclaimer