నోటా సంచలనానికి శాంపిల్

0“ఊపర్ వాలా జబ్ బీ డేటా హై ఛప్పడ్ ఫాడ్ కే దేతా హై”.. సారీ స్పెల్లింగ్ మిస్టేక్.. డేటా కాదు.. ‘దేతా’! ఇక విజయ్ దేవరకొండ సారు పరిస్థితి అలాగే ఉంది ఇప్పడు. ఏం చేసినా అది సంచలనమే అన్నట్టుంది. ఇంకా జనాలు గోవిందం హ్యంగోవర్ నుండి పూర్తిగా బయటకు రాలేదు. అంతలోనే ‘నోటా’ ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి. రేపు రిలీజ్ కానున్న ట్రైలర్ కు ఈ రోజు శాంపిల్ గా ‘స్నీక్ పీక్’ అంటూ హాఫ్ మినిట్ వీడియో రిలీజ్ చేశారు నిర్మాతలు.

ఉన్నది ముప్పై క్షణాలే. కానీ సంచలనం సృష్టించేందుకు అది చాలుగా! అలానే ఉంది స్నీక్ పీక్. ఒక్క డైలాగ్ లేదు. సూపర్ గా కట్ చేసిన ఈ వీడియో లో మొదట దేవరకొండది రౌడీ అవతారం.. ఆ తర్వాత పోలిటిషియన్ గెటప్.. ఫైనల్ గా లీడర్ గా ట్రాన్స్ ఫార్మేషన్.

స్నీక్ పీక్ ఓపెన్ చేయ్యగానే చిట్టిపొట్టి డ్రెస్సుల్లో ఒక స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేస్తున్న అమ్మయిలతో మన ‘రౌడీ’ గారు చిల్ అవుట్ అవుతూ మత్తులో జోగుతుంటాడు. పనిలో పనిగా ఒక ముద్దుకు కూడా రెడీ అవుతాడు. కట్ చేస్తే రాజకీయనాయకుడి అవతారం. కార్యకర్తలు.. నాయకులు నాయకులూ ఒంగి ఒంగి దండాలు పెడుతుంటే డాబుగా పోజిస్తుంటాడు. ఇక ఫైనల్ కట్ లో మాత్రం షాక్ కు గురై పరివర్తన చెంది అసలు సిసలు నాయకుడి అవతారంలో కనిపిస్తాడు.

ఈ స్నీక్ పీక్ లో సామ్ సి. ఎస్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం అదిరిపోయింది. ఇక తెలుగు-తమిళ భాషలలో తెరకెక్కుతున్న ఈ బై లింగువల్ కు ఆనంద్ శంకర్ దర్శకుడు. తమిళ భాషలో విజయ్ స్వయంగా డబ్బింగ్ చెప్తుండడం విశేషం. మెహ్రీన్ ఈ సినిమాలో హీరోయిన్. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను అక్టోబర్ లో రిలీజ్ చేస్తారట. అంతలోపు ఈ స్నీక్ పీక్ పై మీరు ఓ లుక్కేయండి.