నిజంగా ఎన్టీఆర్ అసామాన్యుడేనా?

0సినిమాలను తీయడంలోనే కాదు.. టైటిల్ నిర్ణయించడం విషయంలో కూడా త్రివిక్రమ్ స్టైల్ బాగుంటుంది. రీసెంట్ గా వచ్చిన అజ్ఞాతవాసి లాంటి క్లిష్టమైన పదాన్ని కూడా.. జనాలు అంత తేలికగా ఓన్ చేసేసుకున్నారంటే.. అది పవన్ అండ్ త్రివిక్రమ్ సినిమా కావడమే కారణం.

ఇప్పుడు ఎన్టీఆర్ తో సినిమా స్టార్ట్ చేశాడు త్రివిక్రమ్. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అయిపోయింది కూడా. మొదటగా యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణతో మొదలుపెట్టారు. త్వరలో హైద్రాబాద్ లోని కొన్ని స్టూడియోస్ లో వేసిన భారీ సెట్స్ లోకి షిఫ్ట్ కానున్నారు. దసరా నాటికి ఈ సినిమాను పూర్తి చేసేసి.. థియేటర్లలోకి తెచ్చేయాలన్నది మేకర్స్ ఆలోచన. ఇప్పుడీ సినిమాకు ఓ టైటిల్ ప్రచారంలో ఉంది. “అసామాన్యుడు”అనే టైటిల్ ను అనుకుంటున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఎంతో అప్పుడే తెలియదు కానీ.. ఈ టైటిల్ మాత్రం ఎన్టీఆర్ కి పర్ఫెక్టుగా సరిపోతుందని అంటున్నారు.

పైగా ఇది త్రివిక్రమ్ మార్క్ టైటిల్ గానే కనిపిస్తోంది. కొత్త తరహా పదంతో పాటు.. హీరోయిజం కూడా ఎలివేట్ అవుతుండడంతో.. అసామాన్యుడు అభిమానులకు కూడా నచ్చేస్తున్నాడు. అయితే.. అజ్ఞాతవాసితో ‘అ’ సెంటిమెంట్ ఒకటి వెంటాడుతోంది కానీ.. త్రివిక్రమ్ తన సత్తా చాటి.. తిరిగి తన వైభవాన్ని స్థాయిని ప్రదర్శించేందుకు అహర్నిశలు కృషి చేస్తుండడంతో.. ఎన్టీఆర్ అండ్ ఫ్యాన్స్ ఈ చిత్రంపై నమ్మకంగానే ఉన్నారు.