వీర రాఘవుడిలో హింస తక్కువేనట!!

0

నిన్న రాత్రి అరవింద సమేత వీర రాఘవ ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి యంగ్ టైగర్ ఫ్యాన్స్ లో మాత్రమే కాక రెగ్యులర్ ఆడియన్స్ లో కూడా చర్చ మొదలైంది. దానికి కారణం త్రివిక్రమ్ మార్క్ కి భిన్నంగా వయొలెంట్ బ్యాక్ డ్రాప్ లో సినిమా రూపొందినట్టు కనిపించడం. కత్తులు పట్టుకుని నరుక్కోవడం ప్రత్యర్థిగా చూపించిన జగపతి బాబు తారక్ ని నారపరెడ్డి బిడ్డా అని అడగడం ఇవన్నీ గతంలో ఫ్యాక్షన్ నేపధ్యంలో ఉన్న సినిమాల్లో చూసినట్టు అనిపించడం సహజం. కానీ ఇన్ సైడ్ టాక్ మాత్రం మరోలా ఉంది.

సమయం తక్కువగా ఉండటంతో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో దీని మీద ఆసక్తి రేగి అటు ఓపెనింగ్స్ పరంగా ఇటు బిజినెస్ పరంగా రెండు రకాలుగా క్రేజ్ రావాలనే ఉద్దేశంతోనే ఇలా ట్రైలర్ ని కట్ చేయించినట్టు చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో ట్రెండ్ ని గమనిస్తే ప్రభాస్ మిర్చి తర్వాత ఆ స్థాయిలో మెప్పించిన సీమ ఫ్యాక్షన్ సినిమా మరొకటి రాలేదు. అప్పట్లో సమరసింహారెడ్డి తర్వాత ఆ సీజన్ కొంతకాలం నడిచింది కానీ పదే పదే అవే రావడంతో మొహం మొత్తిన ప్రేక్షకులు వాటిని తిప్పికొట్టేసారు.

విశ్వనీయ సమాచారం మేరకు ఇందులో ట్రైలర్ లో చూపించిన హింస కేవలం ఓ నలభై నిముషాలు మాత్రమే ఉంటుందట. ఫస్ట్ హాఫ్ ఇంట్రో తర్వాత తారక్ పూజా హెగ్డే మధ్య మంచి లవ్ స్టోరీ తో ఎంటర్ టైన్ చేసిన త్రివిక్రమ్ ఇంటర్వెల్ బ్లాక్ దగ్గర నుంచి అసలు కథలోకి ఎంటర్ అవుతాడని చెబుతున్నారు. తన ఊళ్ళో కాలుపెట్టిన తర్వాత కుటుంబాలకు కుటుంబాలను నాశనం చేస్తున్న ఫ్యాక్షన్ రక్కసిని రూపుమాపేందుకు వీర రాఘవ రెడ్డి ఏం చేసాడు అనేది కాస్త వినూత్నంగా తీసారని టాక్. ఎమోషన్స్ కు ఎక్కువ వెయిట్ ఇచ్చిన త్రివిక్రమ్ గుండెలు పిండేసే సెంటిమెంట్ ని జోడించాడని వినికిడి. అందుకే ఒకటే డ్యూయెట్ ఉన్నా తారక్ ఓకే చెప్పాడని తెలిసింది.

మొత్తానికి బోయపాటి శీను కొరటాల శివ వివి వినాయక్ లతో త్రివిక్రమ్ టేకింగ్ ను పోలుస్తూ సోషల్ మీడియాలో బాగానే చర్చ నడుస్తోంది. ఊహకతీతంగా తీయడంలో త్రివిక్రముడిది ప్రత్యేకమైన శైలి కాబట్టి మరి ఆరకంగా ఇందులో ఏమైనా సర్ ప్రైజ్ ఇచ్చాడేమో వచ్చే గురువారం దాకా వేచి చూడాలి.
Please Read Disclaimer