ఏపీలో రూ.200 – నైజాంలో రూ.120

0

మీద పడేంత క్రేజు ఉన్నప్పుడు దండుకుంటే తప్పేంటి? ఏ సినిమా అయినా మొదటి రోజే చూసేయాలన్న కసితో అభిమానులు మీద పడడం ఎంత సహజమో.. ఆ కసిని క్యాష్ గా మార్చుకోవాలని నిర్మాత – డిస్ట్రిబ్యూటర్లు ఆలోచించడం అంతే సహజం. ఇవి రెండూ తప్పుకాదని గతంలో రిలీజ్ చేసిన క్రేజీ సినిమాల టిక్కెట్టు ధరలు చెప్పాయి. రిలీజ్ టైమ్ లో తొలి వారం బాగా టిక్కెట్టు రేటు పెంచుకుని అమ్ముకునే వెసులు బాటు ఉంది. అందుకు ప్రభుత్వాలు సైతం జీవోలు ఇస్తున్నాయి. ఇండస్ట్రీలో అగ్ర హీరోలు – అగ్ర బ్యానర్ల సినిమాలకు భారీ బడ్జెట్లు పెడుతున్నారు కాబట్టి ప్రభుత్వాలు కూడా సోదిలో తగువులేవీ పెట్టుకోవడం లేదు.

ఈ దసరాకి భారీ బడ్జెట్ చిత్రం `అరవింద సమేత` రిలీజ్ కి రెడీ అవుతోంది. అక్టోబర్ 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది కాబట్టి తొలి వారం టిక్కెట్టు ధర పెంచుకుని అమ్ముకునేలా వెసులుబాటు కోసం ప్రయత్నిస్తున్నారట. ఏపీలో రూ.200 యూనిఫామ్ రేటు ఫిక్స్ చేయాలని ప్రభుత్వాన్ని హారిక & హాసిని క్రియేషన్స్ అధినేత రాధాకృష్ణ కోరనున్నారట. ఆ మేరకు ప్రయత్నాలు మొదలయ్యాయని చెబుతున్నారు.

ఇలాంటి రూల్స్ తెలంగాణలో వర్తించవు. అయితే అరవింద సమేత చిత్రాన్ని అగ్రనిర్మాత కం పంపిణీదారుడు దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి తొలి వారం 100 టిక్కెట్టు ధరను ఫ్లాట్గా రూ.120కి అమ్ముకునే వెసులుబాటు కోసం ప్రయత్నిస్తున్నారట. వాస్తవానికి ఇలా టిక్కెట్టు పెంచుకోవాలంటే ప్రభుత్వాలతో పని లేకుండా నేరుగా కోర్టుల్లో తీర్పులుంటాయని ఇదివరకూ విన్నాం. నైజాంలో టిక్కెట్టు రేట్ల గొడవలో తలదూర్చాలంటే అపద్ధర్మ తేరాస ప్రభుత్వానికి హక్కు ఉందో లేదో తెలియదు. అందుకే ప్రభుత్వ జీవోలు తెచ్చుకునేదెలా? కోర్టులో సెటిల్ చేయడమెలా? అంటూ తెగ ఆలోచిస్తున్నారట. దాదాపు 93కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ పూర్తి చేసుకున్న ఈ సనిమా తొలి వారంలోనే 100 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంటే ఆ మేరకు డిస్ట్రిబ్యూటర్లపై ఉండే ఒత్తిడిని అర్థం చేసుకోవాల్సి ఉంటుందేమో! టిక్కెట్టు రేటు పెంచకపోతే ఆ వసూళ్లు అంత సులువేం కాదు.
Please Read Disclaimer