ఎన్టీఆర్ బిజినెస్ కి ఆకాశమే హద్దు

0ఎన్టీఆర్… త్రివిక్రమ్ కాంబినేషన్ ఏ ముహూర్తాన సెట్టయ్యిందో కానీ మామూలుగా లేదు క్రేజ్. ఈ కాంబోలో సినిమా కొబ్బరికాయ కొట్టుకున్నాక మధ్యలో `అజ్ఞాతవాసి` ఫ్లాప్ వచ్చింది త్రివిక్రమ్కి. కానీ ఆ ప్రభావం `అరవింద సమేత`పై ఏ మాత్రం పడలేదు. తాజాగా జరుగుతున్న బిజినెస్సే అందుకు ఉదాహరణ. ఏ ఏరియాకి ఆ ఏరియా రైట్స్ రికార్డు స్థాయిలో అమ్ముడుపోతున్నాయి. తాజాగా శాటిలైట్ రైట్స్ కూడా ఎన్టీఆర్ కెరీర్ లోనే హయ్యస్ట్ ధరకు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. రూ: 23.5 కోట్లకు జీ తెలుగు అరవింద సమేత రైట్స్ని కొనుగోలు చేసినట్టు సమాచారం.

ఇటీవల కాలంలో ఇదే హయ్యస్ట్ రేట్ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కలయికలో… రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో రూపొందుతున్న `అరవింద సమేత` దసరా సందర్భంగా అక్టోబరు 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే నటిస్తున్న ఈ సినిమాని హారిక అండ్ హాసిని సంస్థ నిర్మిస్తోంది. తొలిసారి త్రివిక్రమ్ – ఎన్టీఆర్ కలిసి చేస్తున్న చిత్రమిది. ఎన్టీఆర్ ఈ చిత్రం కోసం రాయలసీమ మాండలికం నేర్చుకొని నటిస్తున్నారు. అలాగే ఆయన సిక్స్ ప్యాక్ అవతారం కూడా అభిమానుల్ని మురిపించబోతోందని చిత్రవర్గాలు చెబుతున్నాయి.