వీరరాఘవుడి టీజర్ అండ్ రిలీజ్ డేట్లివే!

0యంగ్ టైగర్ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘అరవింద సమేత వీర రాఘవ’ ఇప్పుడు సెట్స్ మీద ఉన్న క్రేజీ టాలీవుడ్ ప్రాజెక్ట్ లలో ఒకటి. ఫస్ట్ లుక్ పోస్టర్స్ తోనే సినిమాలో ఎన్టీఆర్ ఒక పవర్ ఫుల్ రోల్ లో కనిపిస్తాడని హింట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా దసరా సీజన్ లో రిలీజ్ చేస్తారని ఇప్పటికే వార్తలు వచ్చాయిగానీ డేట్ విషయం పై మాత్రం కాస్త కన్ఫ్యూషన్ ఉండేది. తాజా సమాచారం ప్రకారం – టీజర్ రిలీజ్ – సినిమా రిలీజ్ డేట్లను ‘అరవింద సమేత’ టీమ్ లాక్ చేసిందట.

సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 11 వ తారీఖున రిలీజ్ చేస్తారట. దీంతో సినిమా షూటింగ్ డిలే అవుతోందని – సినిమా దసరా డెడ్ లైన్ అందుకోలేరని వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పడినట్టే. మరోవైపు ఈ సినిమా టీజర్ ను ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగష్టు 15 న రిలీజ్ చేస్తారట. ఇప్పటికే టీజర్ ను కట్ చేసే పనిలో బిజీగా ఉన్నారట మేకర్స్. సో.. ఈనెల పదిహేనవ తేదీన వీర రాఘవుడి సీమ ఉగ్ర రూపం చూడొచ్చన్నమాట.

రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ ఓ సిటీ బాయ్ గాను – మరోవైపు రాయల సీమ యువకుడిగాను రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడట. ఈ సినిమాలో పూజా హెగ్డే – ఈష రెబ్బాలు హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఈ మూవీకి థమన్ మ్యూజిక్ డైరెక్టర్.