‘బాహుబలి’గా ఎన్టీఆర్‌ !

0అదేంటి? ‘బాహుబలి’ ప్రభాస్‌ కదా! అనుకుంటున్నారా! నిజమే కానీ, ఎన్టీఆర్‌ కూడా బాహుబలి అయ్యారు. ఐఫా అవార్డుల కార్యక్రమానికి విచ్చేసిన ఎన్టీఆర్‌ ‘బాహుబలి వీఆర్‌’ జోన్‌కు వెళ్లారు. సినిమాలో ప్రభాస్‌ వినియోగించిన కత్తి, డాలు పట్టుకుని సందడి చేశారు. ఈ ఫొటోను బాహుబలి చిత్ర బృందం అభిమానులతో పంచుకుంది. గతంలో రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌ ‘స్టూడెంట్‌ నెం.1’, ‘సింహాద్రి’, ‘యమదొంగ’ చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే.

ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా కీలక పాత్రలు పోషించిన ‘బాహుబలి ది: కన్‌క్లూజన్‌’ ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.ntr-baahubali2