ఎన్టీఆర్-అట్లీ ద్విభాషా చిత్రం

0

మొన్ననే `దేవదాస్` రిలీజ్ ప్రమోషన్స్ లో అశ్వనిదత్ తమిళ దర్శకుడు అట్లీతో ప్రాజెక్టును కన్ఫామ్ చేశారు. అట్లీతో ఓ భారీ సినిమా ప్లాన్ చేస్తున్నాం. త్వరలోనే వివరాలు వెల్లడిస్తానని అన్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక్కో అప్ డేట్ బయటకు లీకవుతూ వేడి పెంచుతున్నాయి. మెర్సల్ లాంటి సెన్సేషనల్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన అట్లీ గ్రాఫ్ శంకర్ – మురుగదాస్ .. తర్వాత ఆ రేంజులోనే ఉంది. 200 కోట్ల క్లబ్ దర్శకుడిగా పాపులర్.. పైగా వరుస బ్లాక్ బస్టర్లతో మైమరిపిస్తున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. అందుకే దత్ తెలివిగా అట్లీతో ద్విభాషా చిత్రానికి ప్లాన్ చేశారు. ఇంతకీ ఈ సినిమాలో హీరో ఎవరో తెలుసా?

యంగ్ యమ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించనున్నారని అత్యంత సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఎన్టీఆర్- అట్లీ కాంబినేషన్ లో తెలుగు- తమిళ్ ద్విభాషా చిత్రం తెరకెక్కించేందుకు వైజయంతి మూవీస్ సంస్థ భారీ సన్నాహకాల్లో ఉంది. ప్రస్తుతం అట్లీ స్క్రిప్టు రెడీ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం తారక్ `అరవింద సమేత`లో నటిస్తున్నారు. తదుపరి రాజమౌళి మల్టీస్టారర్ లో నటిస్తారు. ఆపై వైజయంతి ప్రాజెక్టులోకి ఎంటరయ్యే ఛాన్సుందని అంచనా వేస్తున్నారు. వచ్చే ఏడాది ఈ కలయిక ఉండకపోవచ్చు. 2020లో సెట్స్ పైకి వెళ్లే ఛాన్సుంటుందని చెబుతున్నారు.

తాజా సన్నాహకాలు చూస్తుంటే అగ్రనిర్మాత అశ్వనిదత్ మళ్లీ ఫామ్లోకి వచ్చేశారని చెప్పొచ్చు. వైజయంతిలో సక్సెస్ స్పీడ్ కనిపిస్తోంది. దత్ భారీ ప్లాన్స్ షాకిస్తున్నాయి. క్యూలో మహేష్ తర్వాత ఎన్టీఆర్ – చరణ్ ఉన్నారు. మహేష్ ల్యాండ్ మార్క్ (25వ) మూవీ `మహర్షి`ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న దత్ తదుపరి ఎన్టీఆర్ – చరణ్ లతో సినిమాలకు సన్నాహకాల్లో ఉన్నారు. ఇటీవలే అట్లీతో సినిమాని దత్ కన్ఫామ్ చేసినా అప్పటికి హీరో ఎవరో కన్ఫామ్ కాలేదు. ఇప్పుడు తారక్ పేరు వినిపించడం చూస్తుంటే అభిమానులకు ఇదో షాకింగ్ ట్విస్టే అనుకోవాలి!
Please Read Disclaimer