ఎన్టీఆర్ డబుల్ షాక్?

0

ఈ రోజు స్పెషల్ సర్ ప్రైజ్ గా విడుదల చేసిన ఎన్టీఆర్ కొత్త పోస్టర్ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. కారణం అందులో టైటిల్ కింద కథానాయకుడు అనే శీర్షికను జోడించడం. అంటే ఇప్పటి దాకా ప్రచారం లో ఉండి నిజమా కదా అనే అనుమానం ఉన్న రెండు భాగాల బయోపిక్ గురించి డౌట్ ని క్లియర్ చేసినట్టే. ఫస్ట్ ది కథానాయకుడు అని రెండోది ప్రజా నాయకుడు అని విశ్వసనీయ సమాచారం. మొదటి భాగంలో ఎన్టీఆర్ బాల్యం మొదలుకుని చెన్నెలో సినిమా అవకాశాల కోసం అడుగు పెట్టడం నుంచి విశ్వవిఖ్యాత నటసార్వభౌమగా ఎదిగే దాకా అందులో ఉంటుందట.

క్లైమాక్స్ లో టిడిపి పార్టీని స్థాపించాలనే ఆలోచనకు నాంది పడటంతో ఆపేసి ప్రజా నాయకుడు పేరుతో మొదలయ్యే రెండో భాగంలో టిడిపి మొదటిసారి అధికారంలోకి రావడం చైతన్య రధం మీద చేసిన ప్రచారం మొదటి ప్రమాణ స్వీకారం లాంటివన్నీ అందులో ఉంటాయట. రాజకీయంగా వర్తమాన పరిస్థితులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు వహించినట్టు తెలుస్తోంది.

కథ ఇక్కడితో అయిపోలేదు. మొదటి భాగం జనవరి 9 అని ఫిక్స్ చేసి ప్రకటించారు. ఓ పనైపోయింది. మరి ప్రజానాయకుడిగా ప్రచారం జరుగుతున్న రెండో భాగం ఎప్పుడు విడుదల చేస్తారు అనే విషయం ప్రస్తుతానికి గోప్యంగా ఉంచారు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఎక్కువ ఆలస్యం చేయకుండా జనవరి 25నే ప్రజానాయకుడు విడుదల చేసే విధంగా చర్చలు జరుగుతున్నాయట. అది కనక నిజమైతే రెండు భాగాలకు మధ్య గ్యాప్ కేవలం 15 రోజులు మాత్రమే ఉంటుంది. కమర్షియల్ లెక్కల ప్రకారం ఇది సరైన ఎత్తుగడ కాదు.

పైగా అదే రోజు క్రిష్ మరో సినిమా మణికర్ణిక డేట్ ఇంతకు ముందే డిసైడ్ చేసారు. మొన్న టీజర్ లో స్పష్టం చేసారు కూడా. సో ప్రజా నాయకుడు ఎప్పుడు వస్తుందనేదే ఇప్పుడు సస్పెన్స్. షూటింగ్ మాత్రం రెండు భాగాలకు సంబంధించే పూర్తి చేస్తున్నారు కానీ లెంగ్త్ ఎక్కువ కావడంతో ట్రిమ్ చేయకుండా రెండు భాగాలూ విడుదల చేయాలనీ క్రిష్ బాలయ్య కలిసి నిర్ణయం తీసుకున్నట్టు వినికిడి.
Please Read Disclaimer