హీరోయిన్ల కోసం క్రిష్ వేట..

0బాలకృష్ణ హీరోగా , నిర్మాతగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్టీఆర్ బయోపిక్’. ముందుగా ఈ మూవీ ని తేజ డైరెక్ట్ చేస్తాడని ప్రచారం జరిగింది. కానీ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల తేజ తప్పుకున్నాడు. ఆ తర్వాత క్రిష్ చేతికి ఈ మూవీ వెళ్లింది. ప్రస్తుతం క్రిష్ ఈ మూవీ లోని హీరోయిన్స్ కోసం వేట మొదలు పెట్టారట.

ఎన్టీఆర్ బయోపిక్ అంటే హీరోయిన్లు చాల అవసరం. సినిమాలో లెంగ్తీ రోల్స్‌లో కనిపించడానికి కాదు కానీ, ఇలా కనిపించి అలా మెరవడానికి హీరోయిన్లు అవసరం. వారి కోసం క్రిష్ వెతుకుతున్నాడట. కనీసం డజను మంది హీరోయిన్ల అవసరం ఉండవచ్చని సమాచారం. ఇప్పటికే కొన్ని పేర్లు అనుకున్నాడట. వారితో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అన్ని కుదిరితే వచ్చే నెలలో ఈ మూవీ ని సెట్స్ పైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేసున్నారు.