కృష్ణ పాత్రలో మహేష్ బాబు..?

0సూపర్ స్టార్ మహేష్ బాబు…త్వరలో తన తండ్రి పాత్రలో కనిపించబోతున్నాడా..అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. చిన్నతనం లోనే ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన మహేష్ బాబు..తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుని..ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరో రేసులో స్థానం సంపాదించుకున్నాడు.

ఇప్పుడు తండ్రి కృష్ణ పాత్రలోనే నటించేందుకు సిద్ధమవుతున్నాడు. నందమూరి బాలయ్య నటిస్తూ… నిర్మిస్తున్న ‘ఎన్.టీ.ఆర్’ బయోపిక్ లో కృష్ణ పాత్రలో నటించేందుకు రెఢీ అవుతున్నాడట మహేష్. ఎన్టీఆర్ కు ఎదురెళ్లిన ఒకే ఒక్క వ్యక్తి కృష్ణ. ఇద్దరు కలిసి ‘దేవుడు చేసిన మనుషులు’ వంటి అనేక చిత్రాల్లో కలిసి నటించారు. అందుకే ఎన్.టీ.ఆర్ బయోపిక్ సినిమాలో కృష్ణ పాత్ర ఉండడం తప్పనిసరి అని భావించిన డైరెక్టర్ తేజ. ఆ పాత్ర మహేష్ బాబుఐతే కరెక్ట్ అని అనుకున్నాడట. బాలయ్య స్వయం గా మహేష్ కు ఫోన్ చేసి ఆ పాత్ర చేయమని అడగడం , దానికి మహేష్ ఒకే చెప్పాడని అంటున్నారు.

ప్రస్తుతం మహేష్ ‘భరత్ అనే నేను ‘ సినిమా తో ఏప్రిల్ 20 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.