ఎన్టీఆర్ బయోపిక్ .. డేట్ చెప్పిన బాలయ్య

0విశ్వ విఖ్యాత నట స్వారభౌమ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. తనయుడు నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్రలో ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. ఈ సినిమా షూటింగ్‌ ఈ నెల 29న ప్రారంభించనున్నట్లు చెప్పారు బాలకృష్ణ.

ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఈరోజు ఆయన అమరావతిలోని సచివాలయానికి వచ్చారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ సినిమా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తీస్తున్నది కాదని స్పష్టం చేశారు. వచ్చే సంక్రాంతికి విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. తెలుగు వారందరూ పార్టీలకు అతీతంగా ఎన్టీఆర్‌ను అభినందించేవారేనని.. ఈ సినిమాకు చాలామంది చాలా పేర్లు సూచించారని చెప్పుకొచ్చారు బాలయ్య. ఈ సినిమా తేజ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.