ఎన్టీఆర్ రెండు పార్టులా..?

0

NTR-Biopic-Will-Release-in-Two-Partsసినిమా తెరకెక్కించడం ఒక తీరు. అదే సినిమాకు క్రేజ్ పెంచి ఫుల్లుగా క్యాష్ చేసుకోవడం వేరు. ‘బాహుబలి’ కంటే మంచి సినిమాలు లేవా అంటే చాలామంది బాగన్న ‘ఆ’ సినిమాల పేర్లు టక్కున చెబుతారు.. అదే ‘బాహుబలి’ కంటే ఎక్కువగా బాక్స్ ఆఫీస్ దడదడలాడించిన సినిమా పేరు చెప్పమంటే మాత్రం కళ్ళు తేలేస్తారు. మరిప్పుడు క్రిష్ – బాలయ్య టీమ్ కూడా జక్కన్న రూటును ఫాలో అవుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

‘ఎన్టీఆర్’ సినిమ వచ్చే ఏడాది జనవరి 9 న రిలీజ్ చేస్తారని ఇప్పటికే ప్రకటించారు. దీంతో అందరూ ఎన్టీఆర్ మొత్తాన్ని ఒకే టికెట్ పై చూసేందుకు రెడీ అవుతున్నారు.. కానీ ఎన్టీఆర్ ఒక్క టికెట్ కాదు రెండు టికెట్స్ అని ఇప్పటికే గుసగుసలు వినిపించాయి. అర్థం కాలేదా..? ఎన్టీఆర్ ను రెండు భాగాలుగా విడుదల చేసేందుకు నిర్మాతలు రెడీ అవుతున్నారట. మొదటి భాగంలో ఎన్టీఆర్ చిన్నతనం – సినీ జీవితం కవర్ అవుతాయట. ఈ ఫిలిం స్టార్ పార్ట్ జనవరి 9 న రిలీజ్ అవుతుందట. ఇక రెండో భాగాన్ని జనవరి 25 న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ కంక్లూజన్ లో ఎన్టీఆర్ రాజకీయ జీవితం.. అయన ముఖ్యమంత్రిగా చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను కవర్ చేస్తారట.

అంటే.. మొదటి భాగం థియేటర్లలో ఉండగానే రెండో భాగం రిలీజ్ అవుతుందన్నమాట. మరి ఇది కూడా ‘బాహుబలి’ రెండు పార్టుల సక్సెస్ స్టొరీని గుర్తుకు తెస్తుందా లేదా అనేది వేచి చూడాలి. మరి క్రిష్ – బాలయ్య టీమ్ ఏం ప్లాన్ చేసి పెట్టారో త్వరలోనే బయటకు వచ్చే అవకాశం ఉంది.
Please Read Disclaimer