రికార్డులపై కన్నేసిన తారక్

0

NTR-Eyeing-on-Records-with-Aravinda-Sametha`అరవింద సమేత` హీట్ అంతకంతకు రాజుకుపోతున్న సంగతి తెలిసిందే. దసరా కానుకగా ఈ సినిమాని అక్టోబర్11న రిలీజ్ చేస్తున్నారు. అంటే ఇంకో 9రోజులే గ్యాప్ ఉంది. ఆ క్రమంలోనే తారక్ ఫ్యాన్స్ లో ఉత్కంఠ అంతకంతకు పెరుగుతోంది. నాన్నకు ప్రేమతో – జనతా గ్యారేజ్ – జై లవకుశ లాంటి బ్లాక్ బస్టర్ల తర్వాత తారక్ నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలేర్పడ్డాయి. తారక్ కి మాటల మాయావి త్రివిక్రమ్ మార్క్ ఏవిధంగా కలిసి రానుందో చూడాలన్న ఆసక్తి పెరుగుతోంది. ఈ కాంబినేషన్ లో ఇదే తొలి సినిమా కాబట్టి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ సాధ్యమవుతుందో చూడాలన్న ఉత్సాహం జనాల్లో కనిపిస్తోంది.

నేటి సాయంత్రం 8 గంటల 10 నిమిషాలకి `అరవింద సమేత- వీరరాఘవ` అఫీషియల్ ట్రైలర్ ని రిలీజ్ చేయనున్నారు. ముందుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ట్రైలర్ ని రిలీజ్ చేసిన తర్వాత యూట్యూబ్ లోనూ ట్రైలర్ ని అప్ లోడ్ చేస్తారట. నాన్నకుప్రేమతో – జనతాగ్యారేజ్ – జైలవకుశ టీజర్ – ట్రైలర్లు అన్నీ రికార్డులు బ్రేక్ చేశాయి. ఆ తరహాలోనే అరవింద సమేత ట్రైలర్ రికార్డులు బ్రేక్ చేస్తుందనే అంచనాలున్నాయి. అరవింద సమేత టీజర్ కోటి 60లక్షల వ్యూస్ ని సొంతం చేసుకుంది. ఇక ట్రైలర్ ఎలాంటి రికార్డులు నమోదు చేస్తుందో చూడాలి.

అలాగే ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ 80 కోట్ల మేర సాగిందని ట్రేడ్ లో ఆసక్తికర చర్చ సాగుతోంది. అంటే ఆ మేరకు షేర్ వసూళ్లు తేవాల్సి ఉంటుంది. బాక్సాఫీస్ వద్ద ఇప్పటివరకూ తారక్ 100 కోట్ల షేర్ తేలేదు. ప్రభాస్ – చిరంజీవి – రామ్ చరణ్ – మహేష్ లకు మాత్రమే ఆ రికార్డు దక్కింది. ఈసారి తారక్ ఆ రికార్డును అందుకుంటాడా? అంటూ విశ్లేషణలు జోరందుకున్నాయి. అరవింద సమేత 100కోట్ల షేర్ రికార్డ్ అందుకుంటుందని – నాన్నకు ప్రేమతో – జై లవకుశ – జనతా గ్యారేజ్ ని మించి వసూళ్లు తెస్తుందనే అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. త్రివిక్రమ్ మార్క్ అందుకు కలిసి వస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఓవర్ సీస్ టిక్కెట్లు అమ్మేస్తున్నారు. భారీగా ప్రీమియర్లు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.
Please Read Disclaimer