తారక్ ని రౌండప్ చేసి కన్ ఫ్యూజ్ చేశారు!

0

NTR-Fans-Round-up-NTR-In-Aravinda-Sametha-Pre-Release-Eventతారక్ అంటే ఆషామాషీనా! అతడు మామూలుగా కనిపించే పెను తుఫాన్! నందమూరి అభిమానుల గుండెల్లో నిరంతరం వీణ వాయించే గ్రేట్ హీరో. అందుకే బాక్సాఫీసులు బద్ధలైపోతుంటాయ్. తారక్ పై అభిమానులకు ఉండే ప్రేమ ఎంతో చెప్పుకోవాలంటే ఓసారి పాత ఘటనను గుర్తు తెచ్చుకోవాలి. అప్పుడు తారక్ కెరీర్ పూర్తి డైలెమాలో ఉంది. కొన్ని ఫ్లాపులతో ఇబ్బందుల్లోనే ఉన్నాడు. అయినా అతడు `శక్తి` లాంటి భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్నాడు. ఆ సినిమా ఆడియో ఈవెంట్ ని ఇదే `అరవింద సమేత` ఆడియో జరుగుతున్న నోవాటెల్ పరిసరాల్లోనే ఆరుబయట భారీగా ఏర్పాటు చేశారు. ఆ ఆడియోకి తారక్ అభిమానులు అంతే భారీగా తరలి వచ్చారు.

వేలాది కుర్చీలు వేదిక ముందు వేశారు. మూడు నాలుగు స్ట్రింగులతో బారికేడ్లు వేశారు. ఇక వేదికపైకి ఒక్కొక్కరు అతిధులు వచ్చి మాట్లాడుతూ వెళుతున్నారు. ఆ టైమ్ లోనే తారక్ వచ్చాడు అక్కడికి. ఇంకేం ఉంది. వేదిక చుట్టూ ఉన్న జనంలో ఒకటే కంపనం. బారికేడ్లు విరిచేశారు. మొత్తం కుర్చీలన్నీ గల్లంతైపోయాయి. ఎన్ని కుర్చీలు విరిగాయో కానీ మొత్తం ఎన్టీఆర్ అభిమానులంతా ఒక్కసారిగా అన్ని బంధనాల్ని తెంచుకుని వేదికను చుట్టుముట్టేశారు. ఆ క్షణం ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి. ఆ దెబ్బకు అర్థాంతరంగా ఆ కార్యక్రమానికి డిస్ట్రబెన్స్ తప్పలేదు. ఎన్టీఆర్ శాంతించండి అంటూ అరిచినా ఎవరూ పట్టించుకోలేదు. ఎన్టీఆర్ శక్తి ఎంతో తెలిసొచ్చింది అప్పుడే.

అందుకే గతానుభవాల దృష్ట్యా తారక్ ప్రోగ్రామ్స్ అన్నీ ఇన్ డోర్ లోనే ప్లాన్ చేస్తున్నారు. పరిమిత జనాల మధ్య. ఈరోజు అరవింద సమేత ఈవెంట్ ఇండోర్ లో జరిగినా తారక్ రాగానే అభిమానులు చుట్టూ గుమిగూడారు. రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేసేశారు. తారక్ అతడితో పాటు అన్న కళ్యాణ్ రామ్ కూడా వచ్చాడు. అన్నదమ్ములిద్దరికీ కాస్తంత అభిమానుల తాకిడి ఎక్కువగానే ఉంది. ఇక తారక్ యథావిధిగానే పెద్దలందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి తన సీట్లో ఆశీనుడయ్యాడు. తుఫాన్ ముందు నిశ్శబ్ధంలా!!
Please Read Disclaimer