పైన ఆయనకు ఆయనవసరం ఎంతో!!

0

తారక్ ఎమోషన్ పీక్స్ – అరవింద సమేత ఈవెంట్ క్లైమాక్స్ లోనూ అతడిలో ఉద్వేగం అంతకంతకు రెట్టింపైంది. ఆ ఉద్వేగంలో తారక్ ఇచ్చిన స్పీచ్ అహూతుల్ని కట్టిపడేసింది. ఎమోషన్ని రగిలించింది. ప్రీఈవెంట్ ముగిశాక చివరిలో కట్టి పడేసే ప్రసంగంతో అభిమానుల హృదయాల్ని ద్రవింపజేశాడు.

తారక్ మాట్లాడుతూ..-“నెలరోజుల నుంచి చాలా విషయాలు మనసులో పెట్టుకుని ఉన్నాను. ఎలా మాట్లాడాలో తెలీదు. మనిషి బ్రతికి ఉన్నప్పుడు విలువ తెలీదు.. మనిషి చనిపోయాక విలువ తెలుసుకోవాలంటే మనిషి మన మధ్యలో ఉండడు. ఒక తండ్రికి అంతకంటే అద్భుతమైన కొడుకు ఉండడు.. ఒక కొడుక్కి అంతకంటే అద్భుతమైన తండ్రి ఉండదు. ఒక భార్యకు అంతకంటే అద్భుతమైన భర్త ఉండదు. ఒక మనవడు – మనవరాలికి అంతకంటే మంచి తాత ఉండదు. బ్రతికున్నంత వరకూ ఎన్నిసార్లు నాకు ఆయనకు చెప్పాడో తెలుసు. మేమేదో గొప్పోల్లం అని కాదు… ఒక మహానుభావుడి కడుపున నేను పుట్టాను. నా కడుపున మీరు పుట్టారు నాన్నా. మమ్మల్ని మోసుకెళ్లేది మీరే (అభిమానులు). బతికున్నంత వరకూ నాన్నా అభిమానులు జాగ్రత్త .. మనం వాళ్ల కోసం ఏమీ చేయకపోయినా.. మనకోసం అన్నీ త్యాగం చేస్తున్నారు. వాళ్లు జాగ్రత్త జాగ్రత్త అని ఎన్నిసార్లు అన్నాడో ఆ మనిషి. ఈ ఒక్క చిత్రం విడుదల చూడటానికి ఆయన ఉంటే బావుండేది.. మనకు ఆయన అవసరం ఎంత ఉందో తెలీదు కానీ – పైన ఆయనకు ఆయన అవసరం ఎంత ఉందో మరి.. చాలా సార్లు ఆడియో ఫంక్షన్లలో తాతగారు బొమ్మ చూసేవాడిని.. ఇక్కడ నాన్నగారి బొమ్మ అంత త్వరగా వస్తుందని ఊహించలేదు. బౌతికంగా మన మధ్య లేకపోయినా.. మీ అందరి గుండెల్లో – మీలో చూస్తున్నా. మా నాన్నకు ఇచ్చిన మాటే మీ అందరికీ ఇస్తున్నా.. మా జీవితం మీకు అంకితం“ అని అన్నాడు.

ఒక్క మాట.. ఒకటే ఒక్క మాట.. అంటూ వెనక్కి వచ్చి మరీ తారక్ ఓ మాట చెప్పాడు. మా నాన్నకు ఎలాగూ చెప్పలేకపోయినా.. మీ అందరికీ చెబుతున్నాను. జాగ్రత్తగా ఇంటికి వెళ్లండి.. మీకోసం మీ కుటుంబాలు ఉన్నాయి. నడిరోడ్డుపై నిలిచే పరిస్తితి ఉన్నప్పుడు మీకు ముందు మీ కుటుంబం.. ఆ తర్వాతే మేం. మీ అందరూ దయచేసి జాగ్రత్తగా వెళ్లండి. చిరునవ్వుతో కుటుంబ సభ్యుల్ని పలకరించండి. జై హరికృష్ణ .. జై ఎన్టీఆర్… అని ఎంతో ఉద్వేగంగానూ ప్రసంగించాడు.
Please Read Disclaimer