ఎన్టీఆర్ త్రివిక్రమ్.. ప్రాస అదిరింది

0యంగ్ టైగర్ ఎన్టీఆర్… ఐపీఎల్ తెలుగు ప్రసారాలకు బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికైన విషయం తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తారక్ నటించిన ఐపీఎల్ యాడ్ ను అఫిషియల్ గా ట్విట్టర్ లో విడుదల చేసింది స్టార్ స్పోర్ట్స్.

వీవో ఐపీఎల్‌ తెలుగులో ఏంటి స్పెషల్‌’ అని స్నేహితుడు అంటే.. ‘కారం లేని కోడి, ఉల్లిపాయ లేని పకోడి, పెట్రోల్‌ లేని గాడీ, మీసాలు లేని రౌడీ, పరిగెత్తడం రాని కేడీ, ఆవకాయ లేని జాడీ, ఆటల్లేని బడి, అమ్మ ప్రేమ లేని ఒడి’ అంటూ ఎన్టీఆర్‌ డైలాగ్‌లను బుల్లెట్లలా వదులుతుంటే సదరు స్నేహితుడు దండం పెట్టేస్తాడు. ‘అసలు మజా తెలుగురా’ అంటూ ఎన్టీఆర్‌ ముగించడం ఆకట్టుకుంటోంది. ఈ వీడియో మీరూ చూడండి