ప్రతి కథకీ ఓ నాయకుడుంటాడు..

0

నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్ర పోషిస్తున్న NTR అప్ డేట్స్ అంతకంతకు హీట్ పెంచుతున్న సంగతి తెలిసిందే. విశ్వవిఖ్యాత నవరసనటసార్వభౌముడు ఎన్టీఆర్ జీవితకథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలయ్య నటన ఎలా ఉంటుందో చూడాలన్న ఆసక్తి అంతకంతకు నందమూరి అభిమానుల్లో పెరుగుతూనే ఉంది. తాజాగా సంక్రాంతి కానుకగా జనవరి 9 న `NTR – కథానాయకుడు` చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నామని తాజాగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ప్రతి కథకీ ఓ నాయకుడుంటాడు.. కానీ కథగా మారే నాయకుడొక్కడే వుంటాడు ..!! అనే డైలాగ్ ని చిత్రయూనిట్ విడుదల చేసింది. బుర్రా సాయిమాధవ్ మరోసారి తనదైన శైలిలో పంచ్ లతో అదరగొట్టేయడం ఖాయమనడానికి ఈ మచ్చుతునక సరిపోతుందేమో!

యన్ టీఆర్ చిత్రాన్ని ఎన్ బికె ఫిలింస్ ఎల్ ఎల్పి సమర్పణలో వారాహి చలనచిత్రం- విబ్రి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నందమూరి బాలకృష్ణ నిర్మాత. సాయి కొర్రపాటి – విష్ణు ఇందుకూరి సమర్పకులు. యం.యం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

తాజాగా రిలీజ్ తేదీతో పాటు రివీల్ చేసిన పోస్టర్ లో బాలయ్య బాబు లుక్ ఫెంటాస్టిక్ అనే చెప్పాలి. నాటి క్లాసిక్ డేస్ లో నందమూరి తారకరామారావు జానపద కథానాయకుడిగా ప్రదర్శించిన ఆహార్యం ఈ గెటప్ లో ఆవిష్కరించారు. వీరాధివీరుడిగా భారీ డైలాగ్ చెబుతున్న తారకరాముని ఆహార్యాన్ని – ముఖాభినయాన్ని పెర్ ఫెక్ట్ లెంగ్త్ లో చూపించారు క్రిష్. నాటి రోజుల్లో భారీ కెమెరా సెటప్ – స్టూడియో సెటప్ ఈ లుక్ లో కనిపిస్తోంది. పెద్ద పెద్ద డ్రమ్ముల్ని తలపిస్తూ ఆ లైటింగ్ సెటప్ జానపదుల సినిమాటిక్ మూడ్ లోకి తీసుకెళుతోంది. కె.వి.రెడ్డి – భానుమతి రోజుల్ని క్రిష్ గొప్పగానే రీక్రియేట్ చేస్తున్నారని ఈ ఫోటో చెప్పకనే చెప్పింది. మొత్తానికి సంక్రాంతికి ఉందిలే అసలు ట్రీట్ అని కన్ పామ్ చేశారు యన్టీఆర్ బృందం.
Please Read Disclaimer