ఎన్టీఆర్ కష్టం ఎంతో చూశారా!

0తనపై వచ్చే విమర్శలకు జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడూ మాటలతో సమాధానం ఇచ్చిన దాఖలాలు ఉండవు. కానీ చేతలతో మాత్రం చెప్పుచ్చుకు కొట్టిన రేంజ్ లో ఆన్సర్స్ ఇస్తుంటాడు యంగ్ టైగర్. మళ్లీ ఎన్టీఆర్ సైజు పెరిగిపోయాడు అంటూ జైలవకుశ టైంలోను.. అంతకు ముందు వచ్చిన మాటలకు.. సిక్స్ ప్యాక్ చేసి ఇచ్చిన షాక్ మామూలుది కాదు.

ఎన్టీఆర్ తెగ వర్కవుట్స్ చేస్తున్న విషయం అందిరికీ ముందే తెలుసు. స్వయంగా ఫిజికల్ ట్రైనర్ ఇచ్చిన అప్ డేట్స్.. ఈ విషయాన్ని బహిర్గతం చేశాయి. అయితే.. ఇదంతా రాజమౌళి సినిమా కోసం అని అందరూ అనుకున్నారు. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న అరవింద సమేత వీర రాఘవ చిత్రానికి ఫస్ట్ లుక్ నే.. ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ పోస్టర్ ఇచ్చారు. దీంతో ఎన్టీఆర్ ఇలా బాడీని మార్చుకోవడం సినిమా కోసమే అని తేలిపోయింది. అయితే.. ఇదేమీ అంత తేలికగా వచ్చేయలేదు.

జస్ట్ వర్కవుట్స్ తో మాత్రమే బాడీ షేపుల్లోకి వచ్చేయదు. విపరీతంగా డైట్ కంట్రోల్ పాటించాల్సి ఉంటుంది. ఒక్కోసారి అయితే.. రోజు మొత్తంలో 15 లీటర్లు మాత్రమే తీసుకునేవాడట. ఇంకొన్ని సార్లు అయితే.. రెండు లీటర్ల నీటితోనే రోజు గడపాల్సి వచ్చేదట. అంత కఠోరమైన శ్రమ పడ్డాడు కాబట్టే.. 10 కేజీలకు బరువు తగ్గించుకుని.. ఏకంగా సిక్స్ ప్యాక్ చేసి షాక్ ఇవ్వగలిగాడు యంగ్ టైగర్. కమిట్మెంట్ అంటే ఎన్టీఆర్ ను చూసి ఎవరైనా నేర్చుకోవాల్సిందే.