డిసెంబర్ లో RRR ప్రారంభం?

0

యంగ్ యమ ఎన్టీఆర్ నటించిన `అరవింద సమేత` అక్టోబర్ 11న రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఈసారి తారక్ బిజినెస్ రేంజును విస్తరిస్తూ తెలుగు రాష్ట్రాలు-అమెరికా సహా ఆస్ట్రేలియా – న్యూజిల్యాండ్ – ఆఫ్రికా – బ్రిటన్ సహా చాలా చోట్ల ఈ చిత్రాన్ని అత్యంత భారీగా రిలీజ్ చేస్తున్నారు. దాదాపు 100కోట్ల షేర్ వసూళ్లు లక్ష్యంగా సాగుతున్న ప్రయత్నమిది.

`అరవింద సమేత` రిలీజ్ సందర్భంగా తారక్ తన తొలి ఇంటర్వ్యూ ప్రింట్ మీడియాకి ఇచ్చారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఆర్ట్స్ కార్యాలయంలో జరిగిన ఈ ఇంటర్వ్యూలో సినిమాకి సంబంధించి పలు ఆసక్తికర సంగతుల్ని రివీల్ చేసినా.. తదుపరి చిత్రం గురించి మాత్రం తారక్ క్లూ ఇవ్వనేలేదు. అరవింద సమేత రిలీజ్ ముందే అన్నిరకాలుగా మీడియా ఇంటరాక్షన్స్ పూర్తి చేసుకుని నెలరోజుల పాటు ఎవరికీ చిక్కని ఓ ఎగ్జోటిక్ లొకేషన్ కి వెళతానని మాత్రం చెప్పాడు. ఈ టూర్ కుటుంబ సమేతంగా ఉంటుంది. నెలరోజుల పాటు ఎంతగా రెస్ట్ లెస్ ప్రయాణం సాగిందో తారక్ చెప్పుకొచ్చారు. ఈ టూర్ అనంతరం రాజమౌళి & టీమ్ కి బల్క్ గా కాల్షీట్లు ఇచ్చిన తారక్ ముందుగా షూటింగ్ కి జాయిన్ అవుతారని తెలుస్తోంది. ఆ తర్వాత చరణ్ సెట్స్ లో జాయిన్ అవుతారన్న ముచ్చటా సాగింది. ఆ క్రమంలోనే డిసెంబర్ లో RRR షూటింగ్ ప్రారంభమవుతుందన్న స్పెక్యులేషన్ మీడియా వర్గాల్లో సాగింది. అయితే తదుపరి ప్రాజెక్టుపై తారక్ సరైన స్పష్టతను ఇవ్వలేదు.

ఇక `అరవింద సమేత` చిత్రంలో అభయ్ రామ్ ఎంట్రీ ఇస్తున్నారన్న ప్రచారం సాగింది. దీనిపైనా తారక్ నుంచి సరైన క్లూ లేదు. ఇక ఈ చిత్రంలో తారక్ ఇందులో డబుల్ రోల్ చేస్తున్నారా? అంటే అదీ తెరపైనే చూడండి అని నవ్వేశాడట. తారక్ కాలేజ్ విద్యార్థి. అరవిందతో వీరరాఘవుని ప్రేమకథ మాత్రం కట్టిపడేస్తుందని తాను కత్తి పట్టాల్సిన సందర్భం ఏంటో.. అందులో ఎమోషన్ ఏంటో తెరపై చూస్తేనే బాగా కనెక్టవుతుందని అన్నాడు. ఇక ఈ చిత్రం ఆద్యంతం మునుపెన్నడూ చూడనంత ఎమోషన్ థియేటర్ లో ఆడియెన్ ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తుందని మాత్రం కన్ఫామ్ గా చెప్పాడు.
Please Read Disclaimer